Anchor Vishnu Priya : వాళ్లను బాధపెట్టాను.. రెండు రోజులు నిద్రపోలేదు : యాంకర్ విష్ణుప్రియ
Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఒక్కోసారి సోషల్ మీడియాలో పిచ్చి చేష్టలు చేస్తుంటుంది. ఎందుకు అలా చేస్తుంది? అసలేం జరిగిందో అనే విషయాలు చెప్పకుండా తన ధోరణి తానే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో వరుసగా వీడియోలను షేర్ చేసింది. అందులో తన బాధను చెప్పుకొచ్చింది. బాధను పంచుకుంటే తగ్గుతుంది కదా? అని అందరితో చెప్పుకున్నాను అని అంటోంది.. కానీ ఆ బాధ ఏంటో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరినో బాధపెట్టిందట.. రోజంతా మంచిగా ఉందట.. కానీ తన వల్లే చెడిపోయిందట.
Anchor Vishnu Priya Gets Emotional
ఈ మేరకు విష్ణుప్రియ ఏం చెప్పిందంటే.. ‘మామూలుగా అయితే ఈరోజంతా ఎంతో హ్యాపీగా ఉండాలి. ఈరోజు కోసం రెండు రోజుల నుంచి నిద్రపోకుండా ఎంతో ఎగ్జైట్ అయి ఎదురుచూస్తున్నాను. నిద్రలేకపోవడంతో నా మొహం అంతా కూడా పాడైపోయింది. అందుకే ఇప్పుడు ఫిల్టర్ వాడుతున్నాను. నా కళ్లు అన్నీ కూడా పాడైపోయాయి. నా వల్లే ఈ రోజు అంతా డిస్టర్బ్ అయింది. వారిని బాధపెట్టాను. అందుకే ఆ బాధ నుంచి బయటకు రావడానికి ప్రయత్నస్తున్నాను.
Anchor Vishnu Priya : బాధలో ఉన్న విష్ణుప్రియ
Anchor Vishnu Priya Gets Emotional
అయినా జీవితం అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీతో చెప్పుకుంటే ఆ బాధలు తీరిపోతాయ్ అని అనుకున్నాను. అందుకే చెబుతున్నాను. ఐ లవ్యూ ఆల్’ అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇంత చెప్పింది. కానీ ఇందులో మాత్రం తానేం తప్పు చేసిందో చెప్పలేకపోయింది విష్ణుప్రియ. దీంతో జనాలు ఏం అర్థంకాక ఆమెపై రకరకాల మీమ్స్ వేస్తున్నారు. మొత్తానికి విష్ణుప్రియ చేసిన ఈ గందరగోళం, పెట్టిన తికమక మామూలుగా లేదు.
