Vishnupriya : తెల్లవారుఝామునే విష్ణుప్రియ అలా.. ఇలాంటప్పుడే ముచ్చటేస్తుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnupriya : తెల్లవారుఝామునే విష్ణుప్రియ అలా.. ఇలాంటప్పుడే ముచ్చటేస్తుంది!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 October 2021,5:59 pm

Vishnupriya : యాంకర్ విష్ణుప్రియలో రెండు కోణాలుంటాయి. ఒక్కోసారి కురచ దుస్తుల్లో కనిపించి కాకరేపుతుంది, ఇంకొన్ని సందర్భాల్లో నిండుగా కనిపిస్తుంది. లంగావోని,చీరలు, పంజాబీ డ్రెస్సులు ధరించి అందంగా కనిపిస్తుంది. అలాంటి శ్రీముఖి ఈ మధ్య తెరకు దూరంగా ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. తక్కువ వయసులో ఎక్కువ చూసేశానని, పాతికేళ్లలో ఎంత సంపాదించాలో అంత కంటే చాలా ఎక్కువే సంపాదించానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాను కొత్తదారిని వెతుక్కోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది.

Anchor Vishnupriya In Temple At Early Morning

Anchor Vishnupriya In Temple At Early Morning

అందుకే దైవ చింతనలో ఎక్కువ సమయం గడుపుతున్నానని, ఈషా ఫౌండేషన్ కోసం పని చేస్తున్నట్టు, భక్తిభావనలో తలమునకలై.. మనం ఏంటి.. మన రూట్స్ ఏంటి? అనే అన్వేషణలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అందుకే ఈ మధ్య ఎక్కడా ఎక్కువగా షూటింగ్‌లు చేయడం లేదని, తోచిన సాయాన్ని చేస్తున్నట్టు విష్ణుప్రియ తెలిపింది. తాను ఓ ఫౌండేషన్ ప్రారంభించినట్టు, దాని కోసం కష్టపడుతున్నట్టు ఆ మధ్య ఓ వీడియోలో చెప్పుకొచ్చింది.

Vishnupriya : తెల్లవారుఝామునే విష్ణుప్రియ అలా..

Anchor Vishnupriya In Temple At Early Morning

Anchor Vishnupriya In Temple At Early Morning

ఇప్పుడు దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలా నేటి ఉదయమే విష్ణుప్రియ గుడికి వెళ్లింది. పొద్దు పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకునేందుకు విష్ణు ప్రియ లైన్‌లో ఉన్నట్టు తెలిపింది. మొత్తానికి గోసేవ, దైవ భక్తి వంటి వాటితో విష్ణుప్రియ నెట్టింట్లో మంచి పేరు సంపాదించుకుంటోంది. ఈ మధ్యే ది బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ కనిపించింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి