Home » Entertainment » Anil Ravipudi January 12 Vidudala Movie Sankranthi Clash
Entertainment

Anil Ravipudi : అసలు రావిపూడి ఉద్దేశ్యం ఏంటి ?

Anil Ravipudi విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి కాస్త వెరైటీగా ‘జనవరి 12 విడుదల
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 20, 2026 12:56 pm
Advertisement

Anil Ravipudi : విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి కాస్త వెరైటీగా ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ని లాక్ చేయడం పట్ల ఇరు హీరోల అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దానికి తోడు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ కూడా తగిలించారు. ఈ ట్యాగ్ లైన్ వెనుక అసలు ఉద్దేశం.. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను బ్యాలెన్స్ చేయడమేనని సోషల్ మీడియాలో ఓపెన్ గానే చర్చ జరుగుతోంది. కాగా, ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం దర్శకుడు వంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘ఏప్రిల్ 1 విడుదల’ స్టైల్‌ను ఇప్పుడు అనిల్ రావిపూడి ఎంచుకోవడం పట్ల నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement

Anil Ravipudi : అసలు రావిపూడి ఉద్దేశ్యం ఏంటి ?

Anil Ravipudi టైటిల్‌పై ట్రోల్స్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

నిజానికి సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న ఈ నెగెటివిటీ అంతా దర్శకుడు అనిల్ రావిపూడి ముందే ఊహించారని ఇన్ సైడ్ వర్గాల టాక్. గతంలో ఆయన చిత్రాల టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి రచ్చనే జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, మెగాస్టార్ సినిమాకు ఇదేం పేరు అంటూ నెట్టింట పెద్ద హడావిడే నడిచింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సంక్రాంతి బరిలో ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టింది. అంతకుముందు విక్టరీ వెంకటేష్ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని నామకరణం చేసినప్పుడు కూడా ఇలాంటి సెటైర్లు, విమర్శలే వచ్చాయి. కానీ ఆ సినిమా ట్రిపుల్ సెంచరీ కొట్టి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Advertisement

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విషయానికొస్తే.. ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని పాత పాట పల్లవి మొదటి లైన్ ను తీసుకుని మహేష్ కు టైటిల్ గా పెడతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ కు ఆ పేరు పర్ఫెక్ట్ గా యాప్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. సరిగ్గా ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’ టైటిల్ విషయంలోనూ అనిల్ రావిపూడి అదే ధీమాతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొదట ఎంత నెగెటివిటీ వచ్చినా, ఎన్ని ట్రోల్స్ ఎదురైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఫైనల్ గా థియేటర్లలో కంటెంట్ మాత్రమే మాట్లాడుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ చూసే హీరో వెంకటేష్ కూడా అనిల్ కు పూర్తి మద్దతు తెలిపారట.

Anil Ravipudi సంక్రాంతి బరిలో రసవత్తర పోటీ.. ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుందా?

అనిల్ రావిపూడి తన కంటెంట్ పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది జనవరి 12న బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ మాత్రం మామూలుగా ఉండబోవడం లేదు. పండుగ బరిలో టాలీవుడ్ భారీ చిత్రాలు క్యూ కట్టాయి. మెగా 158, సంబరాల ఏటిగట్టు, మహాకాళి వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు.. రవితేజ – శ్రీవిష్ణు కాంబో, శర్వానంద్ – జార్జ్ క్రిష్ సినిమాలు పండగ బరిలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటికి తోడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఒకవేళ నందమూరి బాలకృష్ణ ‘బాలయ్య 111’ డిసెంబర్ లో రాకపోతే, అది కూడా కచ్చితంగా ‘జై సంక్రాంతి’ అంటూ పండగ బరిలోనే దిగుతుంది.

Advertisement

గతంలో ఎన్నోసార్లు ఇలాంటి బాక్సాఫీస్ క్లాషెస్ ను అనిల్ రావిపూడి ఫేస్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. కానీ, ఈసారి మాత్రం పోటీ మునుపటికంటే చాలా టైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ భారీ పోటీని తట్టుకుని సంక్రాంతి విన్నర్ గా నిలబడాలంటే అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లలో ఓ రేంజ్ లో పండాల్సిందే!

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి