Home » Entertainment » Anupama Parameswaran Clears The Rumors
Entertainment

Anupama Parameswaran : ముద్దు సీన్‌లో న‌టించ‌డంపై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన అనుప‌మ‌

Authored By
Sam C
The Telugu News | Published on: August 16, 2022, 8:30 am
Advertisement

Anupama Parameswaran : అందాల ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ.. నిఖిల్ జోడీగా నటించారు.. మంచి కంటెంట్‌ అండ్ విజువల్స్‌తో ఈ సినిమా సూపర్ హిట్‌గా దిశగా దూసుకువెళ్తోంది. చాలా రోజుల త‌ర్వాత అనుప‌మ‌కి ఇంత పెద్ద హిట్ ప‌డే స‌రికి తెగ ఆనందంగా ఉంది.

Advertisement

Anupama Parameswaran : ఓపెన్ అయిన అనుప‌మ‌..

కార్తికేయ 2 స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుప‌మ మాట్లాడుతూ– ‘‘చందూగారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను. ‘కార్తికేయ 2’లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది.. అందుకే ఈ చిత్రం కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్ని చోట్ల హీరోను డామినేట్‌ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు.. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. ‘రౌడీ బాయ్స్‌’లో కథ డిమాండ్‌ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. హీరో నిఖిల్ కన్నా కొన్ని సీన్లలో ఆమె పాత్రకే ఎక్కువ చప్పట్లు పడ్డాయి. “నా పాత్ర ఎంట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

anupama parameswaran clears the rumors

Advertisement

కొన్ని సీన్లలో హీరోలా ఎంట్రీ ఇచ్చాను అంటున్నారు. కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంది,” అని తెలిపింది అనుపమ. అనుపమ బ్లా్క్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్‌గా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించనుందని తెలుస్తోంది. నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమను చిత్రబృదం దించుతున్నారని తాజా టాక్. అంతేకాదు ఇప్పటికే అనుపమ సినిమా కోసం బప్పందంపై సైన్ చేసినట్లు తెలుస్తోంది.సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారట. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి