Anushka shetty: సూపర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తన స్టార్ డం ని అంతకంతా పెంచుకుంది. ఆమె కెరీర్‌లో అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు ఎంతో ప్రత్యేకం. సినిమా ఫ్లాపయిన కూడా సైజ్ జీరో సినిమా కూడా అనుష్క కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్‌లో ప్రభాస్, గోపీచంద్ లాంటి టాల్ హీరోలకి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. తెలుగులో ఎన్ని క్రేజీ మూవీస్ చేసిందో తమిళంలోనూ అలాంటి క్రేజీ మూవీస్ చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అజిత్, సూర్య, మాధవన్ లాంటి వారితోనూ సినిమాలు చేసిన అనుష్క అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అసలు అనుష్క ఇలా స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో వెలుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. అందుకు కారణం ఆమె మనసుకు నచ్చిన యోగా టీచర్ వృత్తిలో ఉండటమే. చాలా సాధారణమైన జీవితం గడిపిన అనుష్క స్టార్ హీరోయిన్‌గా దాదాపు 15 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే అనుష్క ఓ సందర్భంలో సినిమా యూనిట్ సభ్యులలో కొందరికి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చిందట.
ఆమె నటిస్తున్న మూవీ షూటింగ్ జరుగుతున్న సెట్‌లో కొందరు బ్రేక్ టైం లో పొగ త్రాగడం చూసిందట. దాంతో వారిదగ్గరికి వెళ్లి..మీరు ఇలా స్మోక్ చేయడం వల్ల మీ ఆరోగ్యం మాత్రమే కాదు మీ చుట్టుప్రక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా పాడు చేసిన వారవుతారు. దీనివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా..అని సీరియస్ అయిందట. వారికి చాలా క్లియర్‌గా స్మోక్ చేయడం వల్ల వచ్చే నష్టాలను వివరించిందట. ఇక ఆమె సినిమా విషయానికొస్తే త్వరలో చంద్రముఖి సీక్వెల్ మూవీలో నటించబోతోందని సమాచారం. ఇందులో రాఘవ లారెన్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.