Home » Entertainment » Anushka Shetty Is In Hospital With Krishnam Raju
Entertainment

Anushka Shetty : కృష్ణంరాజుతో ఆసుప‌త్రిలో అనుష్క .. మ‌రోసారి వార్త‌ల‌లోకి ప్ర‌భాస్- అనుష్క పెళ్లి

Authored By
Sam C
The Telugu News | Updated on: September 11, 2022 5:55 pm
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే ప్ర‌భాస్ అని ఠ‌క్కున చెబుతారు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ప్ర‌భాస్ నాలుగు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇంకా పెళ్లి చేసుకోకుండానే బ్యాచిల‌ర్‌గా ఉన్నాడు. ఆయ‌న పెళ్లి విష‌యం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు. ఎన్నిసార్లు ఖండించిన కూడా వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

Advertisement

Anushka Shetty : పుకార్లు నిజ‌మా..!

కొన్నాళ్లుగా ప్ర‌భాస్- అనుష్క పెళ్లికి సంబంధించి పుకార్లేమి పుట్టలేదు. ఓ బడా బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జరుగుతుందని నెట్టింట ఓ వార్త వైరల్ అయింది.ఆ బడా బిజినెస్ మ్యాన్‌ బెంగళూరుకు చెందిన వారని ఒకరు అంటుండగా.. దుబాయికి చెందిన వాడని ఇంకొకరు చెప్పుకొచ్చారు. అయితూ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గా, .. హీరోయిన్ అనుష్క వచ్చి చూసింది. ఈ వీడియోను కొందరు రహస్యంగా తీయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభాస్-అనుష్కల సంబంధం మరోసారి బయటపడింది. వీరిద్దరి మ‌ధ్య ఏదో బంధం ఉంది కాబ‌ట్టే అనుష్‌క వ‌చ్చి చూసి వెళ్లింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Anushka Shetty Is In Hospital With Krishnam Raju

Advertisement

ఇక కృష్ణం రాజు మృతిపై అనుష్క శెట్టి వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. కృష్ణంరాజుతో స్వీటికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేలా అనుష్క ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అనుష్కను ప్రేమగా హత్తుకున్నాడు కృష్ణంరాజు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఎంతో మంచి మనసు.. పెద్ద మనసు ఉన్న కృష్ణంరాజు గారు నిజమైన లెజెండ్.. మా గుండెల్లో ఎప్పటికీ మీరు కొలువై ఉంటారు.. అంటూ అనుష్క ఎమోషనల్ అయింది. కాగా , కృష్ణం రాజు సొంత‌పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు. తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్య స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప్రైవేటు ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి