Bigg Boss OTT Telugu non stop ashu reddy and ariyana fighting about akhil
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు రోజురోజుకూ పుంజుకుంటోంది. మసాలా యాడ్ అవుతోంది. గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే వేడి రాజేసుకుంటోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ షో వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ గా ఉంది.కానీ.. వారియర్స్ టీమ్ లో ఉన్న సభ్యుల్లో వాళ్లలో వాళ్లకే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నట్ రాజ్ మాస్టర్ తన సొంత వారియర్స్ టీమ్ తోనే గొడవ పెట్టేసుకుంటున్నాడు. నట్ రాజ్ మాస్టర్ గత సీజన్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు.
ariyana and ashu reddy slaps each other with slippers
మరోవైపు హౌస్ లోకి వచ్చినప్పటికీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అరియానా, అషు రెడ్డి. ఇద్దరిదీ ఒకే టీమ్. ఇద్దరూ వారియర్స్. కానీ.. ఇద్దరూ చాలెంజర్స్ టీమ్ సభ్యుల వల్ల ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకున్నారు. వాళ్లు చెప్పులతో కొట్టుకోవడం చూసి చాలెంజర్స్ సభ్యులు కూడా షాక్ అయ్యారు.ఉదయం లేవగానే.. ఆర్జే చైతూ, యాంకర్ శివ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అషూ, అరియానా అక్కడికి వస్తారు. వీళ్లు అంతా మంచిగా కలిసి ఉన్నారు. వీళ్లు ఎప్పుడు విడిపోతారా అని చూస్తున్నారు అని ఆర్జే చైతూతో అనీల్ రాథోడ్ అంటాడు.
అవును.. వాళ్లు అదే వెయిట్ చేస్తున్నారు అని అషు, అరియానాను ఉద్దేశించి ఆర్జే చైతూ అంటాడు. దీంతో మీలో మీకే ఒక టాస్క్ రావాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. మేము పనులు చేయకపోతే మీరు పనిష్ మెంట్ ఇవ్వాలి కానీ.. మేము పోగొట్టేసుకుంటే మీరు వెతికితే కాదు.. మీరే దాచేసి మీరు పనిష్ మెంట్ ఇవ్వడం కాదు అంటుంది అషురెడ్డి.
మిమ్మల్ని ఏదో టార్చర్ పెట్టే పనిష్ మెంట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అషు రెడ్డి అని అంటాడు ఆర్జే చైతూ. అషూ సరే.. అంటాడు యాంకర్ శివ. ఇంతలో అరియానా అందుకొని అది కూడా కరెక్టే. మేకప్ లేకుండా దీన్ని చూడలేం. చెండాలంగా ఉంటుంది అని అంటుంది అరియానా.
దీంతో అషు రెడ్డికి కోపం వచ్చి.. తన చెప్పు తీసుకొని అరియానాపై విరుచుకుపడుతుంది. నువ్వు అసలు ఎవరి టీమే.. ఎవరి టీమ్ లో ఉన్నావు అంటుంది అషు. దీంతో అరియానాకు కూడా కోపం వచ్చి చెప్పు తీసుకొని అషు రెడ్డిని కొడుతుంది. ఇద్దరూ కలిసి కొంత సేపు చెప్పులతో కొట్టుకుంటారు.
ఆ తర్వాత అరియానా చాలా బాధపడుతుంది. నన్ను చెప్పుతో కొట్టావు. నాకు అస్సలు నచ్చలేదు అని అషుతో అంటుంది. దీంతో నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలేదు. ఏదో ఊరికే అలా కొట్టాను కానీ.. కావాలని కాదు అని క్షమాపణ చెబుతుంది అషు. దీంతో అరియానా కూల్ అవుతుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.