Home » Entertainment » Ariyana Gets Bumper Offer
Entertainment

Ariyana : అరియానా ఏంటి, ఇలా చేసింది.. ఫినాలేలో డబ్బులు తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చేసింది..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 22, 2022, 12:30 pm
Advertisement

Ariyana: ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న గేమ్ షో బిగ్ బాస్. నాన్‌స్టాప్‌గా ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మంకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకోగా, వీరిలో ఎవ‌రు విన్న‌ర్, ఎవ‌రు ర‌న్న‌ర్ అవుతారు అనే దానిపై ఆస‌క్తి నెలకొంది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా ఒక మహిళకు బిగ్ బాస్ టైటిల్ ద‌క్కింద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. ఇక అఖిల్ సీజన్ 4లో రన్నరప్ టైటిల్ సాధించగా.. నాన్ స్టాప్‌లోనూ రన్నరప్ దక్కించుకోవడంతో అతని ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారు. నిన్నటి వరకూ మిత్రాశర్మ టాప్ 3లో ఉందంటూ ప్రచారం జరగింది.

Advertisement

ariyana gets bumper offer

అరియానాకి బంపర్ ఆఫ‌ర్..

చివరి వారానికి వచ్చేసరికి మిత్రా శర్మ కూడా ఫ్యాన్ బేస్ పెంచుకుంది. ఆమెకు కూడా ఓట్లు పడ్డాయి. అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అవుతున్నా మిత్రాశర్మ.. ఫైనల్ ఫైట్‌లో నిలవగలిగింది. శివకి మూడో స్థానం దక్కితే.. ఖచ్చితంగా సూట్ కేస్ అందుకునే అవకాశం ఉంది. సీజన్ 4లో మూడో స్థానంలో నిలిచిన సొహైల్.. పాతిక లక్షలు తీసుకుని గేమ్ నుంచి తప్పుకోవడంతో అఖిల్ రన్నర్ కాగా.. అభిజిత్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అరియానా విష‌యానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం అరియానా రూ.10 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అనీల్ రావిపూడి, సునీల్ ఇద్దరూ హౌస్‌లోకి వెళ్లి అరియానాకి రూ.10 లక్షల ఆఫర్ ఇవ్వడం.. దానికి ఆమె టెంప్ట్ కావడంతో ఫినాలే ఫైట్ నుంచి అరియానా తప్పుకున్నట్టు తెలుస్తుంది. అరియానా రూ.10 లక్షలు తీసుకుంటే.. బిందుకి ఇచ్చే విన్నర్ ప్రైజ్ మనీకి రూ.10 లక్షలు కోతపడినట్టే. మొత్తం ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో.. మిగిలిన రూ.40 లక్షల్ని మాత్రమే బిందు మాధ‌వి అందుకునే అవకాశం ఉంది. ఏదైతేనేం అరియానా మాత్రం సేఫ్ జోన్‌లోనే ప‌డింద‌ని అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి