Home » Entertainment » Ashu Reddy About Happy Days Show
Entertainment

Ashu Reddy : కలవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. నంబర్ షేర్ చేసిన అషూ రెడ్డి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 17, 2021, 6:43 pm
Advertisement

అషూ రెడ్డి బుల్లితెరపై ఎంతలా రెచ్చిపోతోందో అందరికీ తెలిసిందే. కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి అషూ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు కామెడీ స్టార్స్ టీం బాగా కష్టపడుతోంది. అషూ, హరిలు కూడా తమ తమ స్కిట్లు, పాత్రల్లో బాగానే జీవిస్తుంటారు. నిజంగానే ప్రేమను ఒలకబోస్తున్నట్టు నటిస్తుంటారు. ఇక హరి అయితే ఏకంగా అషూ పేరును తన ఎద మీద టాటూలా వేయించుకున్నాడు.

Advertisement

Ashu Reddy ABout Happy Days Show

అది నిజమైందో కాదో అనే క్లారిటీ ఇంకా ఇవ్వడం లేదు. ప్రతీ స్కిట్లో తన ఎదపై ఉన్న టాటూను చూపిస్తాడు. ఇక అషూ ఏమో.. తన తల్లి తప్ప ఇంకెవ్వరు కూడా తన టాటూను వేయించుకోలేదు అని చెబుతుంది. అలా మొత్తానికి జనాలకు కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. మొత్తానికి అషూ హరి జోడి మాత్రం నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. యాంకర్ రవి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లకముందు ఆయనతో కలిసి హ్యాపీ డేస్ అనే షోను అషూ రెడ్డి చేసింది.

Advertisement

హ్యాపీ డేస్ కోసం అషూ రెడ్డి :

Ashu Reddy ABout Happy Days Show

కానీ మేల్ యాంకర్ లేకపోవడంతో ఆ షో ఆగిపోయింది. ఇప్పుడు దానికి కొత్త యాంకర్ దొరికాడు. మళ్లీ హ్యాపీ డేస్ షో ప్రారంభమైంది. తనను కలుసుకోవాలనుకుంటే.. ఈ నంబర్‌లో రిజిస్టర్ చేసుకోండి అంటూ హ్యాపీ డేస్ షోకు సంబంధించిన నంబర్‌ను షేర్ చేసింది. మొత్తానికి హ్యాపీ డేస్ షోను అషూ రెడ్డి బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. అలా తనను కలిసే అవకాశాన్ని అభిమానులకు హ్యాపీ డేస్ రూపంలో అషూ రెడ్డి ఇస్తోందన్నమాట.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి