Home » Entertainment » Ashu Reddy And Rehul Sipligunj Latest Pic
Entertainment

Ashu Reddy : భుజం మీద చేతులేసి మరీ.. అషూ రాహుల్ బంధం మామూలుగా లేదు!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 20, 2021, 4:40 pm
Advertisement

Ashu Reddy ప్రస్తుతం అషూ రెడ్డి సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఆర్జీవీతో కలిసి అషూ రెడ్డి పెట్టిన మంట మామూలుగా లేదు. ఆర్జీవీతో కలిసి అషూ చేస్తోన్న రచ్చ ఇప్పుడు అగ్గిరాజేస్తోంది. అషూను రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీస్తోన్న వర్మ వీడియాను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా అషూ వర్మతో చేస్తోన్న రచ్చ చల్లారనే లేదు. మళ్లీ ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి హల్చల్ చేస్తోంది. ఈ మధ్య కొన్ని రోజులుగా అషూ రాహుల్ వ్యవహారం ఎక్కడా కనిపించడం లేదు.

Advertisement

Ashu Reddy And Rehul Sipligunj Latest Pic

అషూ రాహుల్ బంధం మామూలుగా లేదు Ashu Reddy

 

Advertisement

రాహుల్ అషూల Ashu Reddy  మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులం, జాన్ జిగ్రీలం అంతకు మించి ఏమీ లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. మధ్యలో అషూ కొన్ని ఎక్స్ ట్రాలు చేయడంతో మళ్లీ వీరి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రాహుల్ ఎక్కడ ఉన్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తే.. నా గుండెల్లో ఉన్నాడంటూ అషూ చెప్పుకొచ్చింది. అలా ఈ ఇద్దరి గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ జరుగుతూనే ఉంటుంది.

Ashu Reddy And Rehul Sipligunj Latest Pic

Advertisement

మధ్యలో కొన్ని రోజులు అషూ ఎక్స్ ప్రెస్ హరి అంటూ ట్రాక్ నడిచింది. హరితో కలిసి చేసే స్కిట్లతో అషూ కూడా బాగానే వైరల్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ రాహుల్ సిప్లిగంజ్ చెంతకు చేరినట్టుంది. తాజాగా అషూ రాహుల్ సిప్లిగంజ్ కలిసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో అషూ మరింత సన్నిహితంగా ఉంది. భుజం మీద చేతులు వేసి ఎంతో క్లోజ్‌గా ఉంది. అలా మొత్తానికి నిన్న రాత్రి ఈ ఇద్దరూ బాగానే ముచ్చట్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

 

Ashu Reddy About Express Hari Love

 

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి