Ashu Reddy Friend Satires On Bigg Boss Beauty Dance
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్ స్మాష్ ద్వారా అషూ రెడ్డి ఫేమస్ అయింది. జూనియర్ సమంతగా నెట్టింట్లో క్రేజ్ సంపాదించుకుంది.అలా సినిమాల్లోకి వచ్చింది. ఒకటి అరా చిత్రాల్లో కనిపించింది. కానీ ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ తరువాత బిగ్ బాస్ మూడో సీజన్లో మెరిసింది. ఓ ఐదారు వారాలున్నట్టుంది. కానీ ఆమెకు క్రేజ్ రాలేదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ అయిన తరువాత.. రాహుల్ సిప్లిగంజ్ బయటకు వచ్చాక అషూ క్రేజ్ పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ నడిపిన వ్యవహారం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అది ప్రేమా?
ఫ్రెండ్ షిప్పా? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కేది కాదు. అంత క్లోజ్‌గా కనిపించేవారు. రాహుల్ మీదకు అషూ ఎక్కేది. ఆ ఫోజులు, ఫోటోలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కానీ తామిద్దరం కేవలం మంచి స్నేహితులం జిగ్రీ దోస్తులమని రాహుల్, అషూలు చెప్పుకుంటూ వస్తారు. కానీ రాహుల్ పోస్ట్‌లకు అషూ హార్ట్ సింబల్స్‌తో రిప్లైలు ఇస్తుంటుంది. అలా అషూ కొన్ని రోజులు నానా హంగామా చేసింది. ఆ తరువాత కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ నడిపించింది. పచ్చ బొట్టు అంటూ హరి ఎక్స్ ట్రాలు చేయడం, దాని మీద అషూ తెగ ఫీలవ్వడం, బైకులు కొనివ్వడం వంటి వాటితోనూ ఫేమస్ అయింది.
Ashu Reddy Friend Satires On Bigg Boss Beauty Dance
ఇక ఆర్జీవీ చేసిన చెత్త ఇంటర్వ్యూ అయితే కాకరేపింది. అషూరెడ్డి ప్రైవేట్ పార్టుల మీద వర్మ చేసిన కామెంట్లు నెట్టింట్లో మంటలు పుట్టించాయి. అలా అషూ రెడ్డి ఏదో ఒక టాపిక్‌తో నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. మొన్నటి వరకు అషూ రెడ్డి బిగ్ బాస్ ఓటీటీలో కనువిందు చేసింది. ఇక అషూ రెడ్డికి అంతగా డ్యాన్సు రాదు. అయితే తాను వేసే పిచ్చి పిచ్చి స్టెప్పుల మీద ఆమె ఫ్రెండ్ కౌంటర్ వేసింది. పిచ్చి అంటారు సర్ అని అషూ రెడ్డి వేస్తోన్న డ్యాన్స్‌ల మీద సెటైర్ వేసింది. అది డ్యాన్స్ ప్రాక్టీస్ అని అషూ రెడ్డి బాగానే కవర్ చేసేసుకుంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.