Home » Entertainment » Asia Made Noise With Nukaraju In Jabardasth Episode
Entertainment

Jabardasth : ప్రస్తుతానికి జబర్దస్త్ కి ఈ జోడినే దిక్కు.. వీళ్లు ఏ స్థాయిలో రేటింగ్ తెచ్చి పెడతారో..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 17, 2023 12:53 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ కార్యక్రమం ఈ మధ్య కాలంలో రేటింగ్ దారుణంగా తగ్గింది. 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం లో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని మల్లెమాల వారు భావిస్తున్నారు, ఈ సమయంలో వారం వారం రేటింగ్ తగ్గుతున్న కారణంగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిని పక్కకు పెడుతున్నారు. అందులో భాగంగానే హైపర్ ఆది ని పక్కకు పెట్టడం జరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మరి కొందరిని కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువ కంటెంట్ ఇచ్చే

Advertisement

వారిపైనే మల్లెమాల వారు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నూకరాజు మరియు ఇమాన్యుల్ వంటి వారిపై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇమాన్యుల్ మరియు వర్ష ల యొక్క జోడి ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది.. అందుకే కొత్తగా నూకరాజు మరియు ఆసియాలను తెరపైకి తీసుకు వచ్చారు. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు,

Asia made noise with Nukaraju in Jabardasth episode

Advertisement

తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ లో నూకరాజు తో కలిసి ఆసియా సందడి చేసింది. ఆ సమయంలో నూకరాజు తల్లి స్కిట్ వరకు అయితే పర్వాలేదు కానీ వీరి ప్రేమను ఒప్పుకునేది లేదు అంటూ ఒకింత డ్రామా క్రియేట్ చేసింది. ఆ డ్రామా తో వచ్చే వారం ఎపిసోడ్ పై ఆసక్తి కలుగుతుంది. కచ్చితంగా ఎపిసోడ్ బాగుంటుంది.. నూకరాజు స్కిట్ ప్రత్యేకంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. నూకరాజు మరియు ఆసియా ల యొక్క ప్రేమ జర్నీ తో అయినా జబర్దస్త్ కి రేటింగ్ పెరుగుతుందేమో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి