Assembly Rowdy Pakeezah vasuki is now poor woman
Assembly Rowdy Pakeezah : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే కాబోలు. స్టార్లు కాస్త జీరో అవుతారు.. జీరోలు కూడా స్టార్లు అవుతారు. అందుకే ఓవర్ నైట్ లో సినీ ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతుంటాయి. అలా… ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నటి పాకీజా ఇప్పుడు దీనస్థితిలో ఉంది. తన అసలు పేరు వాసుకి. తను 1980 నుంచి 1990 వరకు వచ్చిన సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో వందల సినిమాల్లో నటించింది వాసుకి.
నిజానికి తనది ఏపీ కాదు. తమిళనాడులోని కారైకుడి. చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. తనకు అసెంబ్లీ రౌడీ సినిమాలో నటించిన పాకీజా అనే క్యారెక్టర్ మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. కానీ.. ప్రస్తుతం వాసుకి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో తను ఉంది. చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా.. బాగానే సంపాదించినా.. సంపాదించిన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకొని పాకీజా ఇప్పుడు నడి రోడ్డు మీదికి వచ్చేసింది. తెలుగులో పాకీజా దాదాపు 50 సినిమాల్లో నటించింది.
Assembly Rowdy Pakeezah vasuki is now poor woman
అప్పట్లో స్టార్లుగా ఉన్న అందరు హీరోల సరసన పాకీజా నటించింది. సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత తన సొంతూరుకు వెళ్లిపోయింది పాకీజా. తెలుగు, తమిళం కలిపి మొత్తం 150 సినిమాల్లో నటించింది. తనకు కనీసం ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు. దీంతో హాస్టల్ లో ఉంటోంది పాకీజా. ఇండస్ట్రీలో చాలామంది పెద్దలను కలిసినప్పటికీ ఎవ్వరూ తనకు సాయం చేయలేదట. అంత డబ్బు సంపాదించినా చివరకు చెన్నైలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను అని బావురుమంది పాకీజా. తన పరిస్థితి ఇంత దారుణంగా మారడం చూసి ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.