
Venu Swamy : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన వేణు స్వామి...!
Venu Swamy : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు బాగా వినిపిస్తుంది.తనదైన శైలిలో సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు.తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ జాతకం గురించి వేణు స్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని తిరుమల లో కలిశారట. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి తల్లి శాలినితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన మాటలకు ఆమె ఆశ్చర్యపోయారట. ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని వేణు స్వామి తల్లి శాలినీకి వివరించారట.
అప్పటికే ఎన్టీఆర్ కు ఉన్న దోషం తెలిసిన తల్లి శాలిని అంత కరెక్ట్ గా కొడుకు జాతకం గురించి ఎలా చెప్పుతున్నారని ఆశ్చర్యపోయారట. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు అని ఎన్టీఆర్ కు ఉన్న పుట్టుక దోషం గురించి వేణు స్వామి క్లియర్ గా చెప్పారట. ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్ తో పాటు శాలినీకి మాత్రమే తెలుసు అని, మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు అని, అలాంటిది ఈ విషయం వేణు స్వామికి ఎలా తెలుసు అని ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రశ్నించిందట. నాకు అన్ని విషయాలు తెలుసంటూ వేణు స్వామి సమాధానం ఇచ్చారట. అయితే ఆ సమస్య ఏంటనేది మాత్రం బయటికి చెప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రం అని, జయలలిత ది కూడా అదే నక్షత్రమని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, ఖచ్చితంగా 2030 వరకు ఆయన్ను రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతున్నారని వేణు స్వామి పేర్కొన్నారు. తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజయోగం పడుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ జాతకం లో కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం ఉందని, కానీ ఆయనకు దోషం ఉందని వేణు స్వామి తెలిపారు. అయితే ఆ దోషం ఏంటనేది చెప్పకపోవడంతో నందమూరి అభిమానులు భయపడుతున్నారు
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.