
Auto Ram Prasad GetupAs Indraja In Extra Jabardasth
Indraja : బుల్లితెరపై ఇంద్రజ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. జబర్దస్త్ షోకు గెస్టుగా వచ్చి ఇప్పుడు జడ్జ్‌గా ఫిక్స్ అయిపోయింది. ఆ మధ్య రోజాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వచ్చిన గ్యాప్‌ను ఇంద్రజ పూరించింది. అయితే ఇప్పుడు ఫుల్ టైం జడ్జ్‌గా ఇంద్రజ ఫిక్స్ అయిపోయింది. జబర్దస్త్ షోకంటే ముందు ఇంద్రజ.. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు జడ్జ్‌గా వ్యవహిరించింది. ఆ షో సూపర్ హిట్ అయింది.ఇంద్రజ, సుధీర్ మదర్ అండ్ సన్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఇంద్రజను చేయి పట్టుకుని తీసుకొచ్చి మరీ తన కుర్చీ వద్ద కూర్చోబెడతాడు సుధీర్.
ఇక ఇంద్రజ అయితే జడ్జ్ మెంట్ చెప్పే సమయంలో వీరావేషానికి లోనవుతుంది. ఎవరైనా పాటలు పాడితే తన్మయత్వానికి లోనై.. వేరే ప్రపంచానికి వెళ్తుంది. డ్యాన్సులు, పాటలు ఇలా అన్నింట్లోనూ ఇంద్రజ అదరగొడుతుంది.అయితే ఇప్పుడు ఇంద్రజ తన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో చేసే వాటిని ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో స్పూప్‌గా చేసి చూపించాడు. ఇంద్రజల గెటప్పు వేసుకుని రాం ప్రసాద్ అదరగొట్టేశాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్‌ని కాస్తా శ్రీదేవీ డ్రామా కంపెనీగా మార్చేశారు. తనలా డ్యాన్స్ వేయడంతో..
Auto Ram Prasad GetupAs Indraja In Extra Jabardasth
రాం ప్రసాద్‌ని చూసి ఇంద్రజ తల పట్టుకుంటుంది. మీరెక్కడ దొరికార్రా బాబు అన్నట్టుగా చూస్తుంది.ఇక ఇంద్రజను పట్టుకుని వచ్చినట్టే.. రాం ప్రసాద్‌ని కూడా పట్టుకుని కుర్చీ వద్దకు తీసుకొస్తాడు సుధీర్. నువ్ ఇలా పట్టుకొస్తుంటే నా ఏజ్ ఎక్కువని అంతా అనుకుంటున్నారు.. నీ క్లోజప్ షాట్స్ కోసం నా ఏజ్ పెంచుకు అని రాం ప్రసాద్ అంటాడు. దీంతో ఇంద్రజ పగలబడి నవ్వేస్తుంది. ఆ తరువాత ఇంద్రజ స్టైల్లోనే ఓ జడ్జ్మెంట్ ఇస్తాడు రాం ప్రసాద్. దీంతో అందరూ నవ్వేస్తారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.