Home » Entertainment » Baby Heroine Vaishnavi Chaitanya Upcoming Movies
Entertainment

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య జాక్ పాట్ కొట్టేసింది.. క్యూ కడుతున్న దర్శకనిర్మాతలు.. బేబీ హిట్‌తో మారిన ఫేట్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: September 7, 2023 2:52 pm
Advertisement

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య అనేకంటే బేబీ అంటే ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. అచ్చ తెలుగు అమ్మాయి. తనలో ఇంత టాలెంట్ ఉందని చాలామందికి తెలియదు. ఏదో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అని అనుకున్నాం. కానీ.. తనది హీరోయిన్ ఫేస్ అని.. తనకు హీరోయిన్ అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని బేబీ సినిమా చూశాక కానీ తెలియలేదు. అసలు బేబీ సినిమాలో ఎంత నాచురల్ గా యాక్ట్ చేసింది. అందుకే కదా బేబీ సినిమాలో తనకు వందకు వంద మార్కులు పడ్డాయి.తెలుగమ్మాయిలకు అవకాశాలు రావని.. చాలా తక్కువగా వస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉన్నప్పటికీ.. తన టాలెంట్ తో తెలుగమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించి…

Advertisement

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. అవును.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య చేతుల్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవడం మీ వంతు అవుతుంది.రామ్ పొతినేని హీరోగా డబుల్ స్మార్ట్ అనే సినిమా రాబోతోంది. పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది కదా.. ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనే సినిమా రాబోతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను తీసుకున్నారట పూరీ.అంటే రామ్ సరసన వైష్ణవి నటించబోతోందన్నమాట. ఇక.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న మరో సినిమాలోనూ బేబీకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంటే సినిమా మామూలుగా ఉండదు కదా.

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య జాక్ పాట్ కొట్టేసింది.. క్యూ కడుతున్న దర్శకనిర్మాతలు.. బేబీ హిట్‌తో మారిన ఫేట్

Advertisement

Vaishnavi Chaitanya : రామ్ సరసన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన బేబీ

ఇక కన్నడ మూవీ ప్రొడ్యూసర్ కూడా వైష్ణవిని కలిశారట. కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం అడిగారట. మొత్తానికి తన చేతుల్లో ప్రస్తుతం బాగానే సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు కూడా విడుదల అయితే బేబీ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అంతే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి