Home » Entertainment » Bad News For Prabhas Fans
Entertainment

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుండెలు పగిలిపోయే బ్యాడ్ న్యూస్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 28, 2022, 4:20 pm
Advertisement

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. బాహుబలి కి ముందు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రభాస్ తెరకెక్కించే ప్రతి సినిమా కూడా భారీ తారగణంతో తెరకెక్కిస్తూ భారీ కలెక్షన్స్ రాబడుతుంది. అయితే కథపరంగా సినిమాలు ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వస్తుండడంతో దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ ఆది పురుష్ ‘.

Advertisement

ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయేసరికి ఈ సినిమాను మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ మూవీని 2023 జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మిగతా వర్క్ పై బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

bad news for prabhas fans

Advertisement

సలార్ సినిమాను హోం భలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, అభినయశ్రీ, మీనాక్షి చౌదరి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం డేట్ ను కూడా ఫిక్స్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2024 కు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమా ఖచ్చితంగా విడుదల వాయిదా పడేటట్లు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి