
balakrishna funny video with saptagiri
Bala Krishna : నందమూరి బాలయ్య ఆరు పదుల వయస్సులోకి చేరుకున్నా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. అలానే ఆహాలో అన్‌స్టాప్ బుల్ షోతో హోస్ట్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బాలయ్య ఒక్కోసారి చిన్న పిల్లాడిలా మారి సందడి చేస్తుంటాడు. తన తోటి నటీనటులతో కలిసి ఫన్ కూడా చేస్తుంటాడు. బాలయ్యకు సంబంధించిన ఏ వీడియో అయిన బయటకు వచ్చిన అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలయ్య NBK 107 మూవీ షూటింగ్‌లో భాగంగా టర్కీలో ఉన్నవిషయం తెలిసిందే. షూటింగ్‌లో ప్రముఖ కమెడియన్ సప్తగిరి బాలయ్యను ఆయన ముందే ఇమిటేట్ చేసేందుకు ట్రై చేశాడు. బాలయ్య స్టైల్లో ఓ పెద్ద డైలాగ్‌ను ఆయన్ను అనుకరిస్తూనే చెప్పాడు.
balakrishna funny video with saptagiri
ఇద్దరు ఒకేసారి డైలాగ్ చెబుతుండగా.. మధ్యలో బాలయ్య ఆపేశారు. సప్తగిరి కంటిన్యూ చేసి బాలయ్యను మెప్పించాడు. దీంతో వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల మీద పడ్డాడు. ‘ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా..’ అంటూ బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఫన్నీ వీడియో ప్రతి ఒక్కరికి తెగ నచ్చేసింది.
అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. అటు మలినేని గోపీచంద్ రవితేజతో క్రాక్ లాంటి మాసీవ్ బ్లాక్‌బస్టర్ కొట్టి ఇప్పుడు ఏకంగా బాలయ్యనే డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. మలినేని గోపీకి ఇది పెద్ద హీరో సినిమా కావడంతో చాలా ప్లానింగ్‌తో పాటు ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ల లీగ్‌లో చేరాలని కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. శృతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్‌లో జరుగుతోంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.