
baladitya elemination for cheating bigg boss star maa nagarjuna
Bigg Boss Baladitya : బిగ్ బాస్ హౌస్ లో శనివారం అనూహ్యంగా బాలాదిత్య ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అసలు బాలాదిత్య ఏం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో కాస్త కూస్తో సెటిల్డ్ గా ఉంది అతనేగా.. మీద పడి గొడవ పడటాలు.. ఆటలో శృతిమించడాలు.. ముఖ్యంగా బూతు పంచాగం ఎత్తడాలు లాంటివి అసలు బాలాదిత్యకి చేత కాదు కదా మరి ఎందుకు అతను ఎలిమినేట్ అయ్యాడు అంటే ఇవేవి చేయట్లేదు కదా అందుకనే బిగ్ బాస్ టీం అతన్ని బిగ్ బాస్ ఇంటి నుంచి తన ఇంటికి పంపించేసిందని అంటున్నారు.
బిగ్ బాస్ కి రేటింగ్ రావాలంటే బాలాదిత్యలా ప్రతిదానికి సర్ధుకుపోతూ.. ప్రతి గొడవని సర్ధుమనిగేలా చేయడం కాదు అలా చేయడం వల్ల షో రేటింగ్ కి దెబ్బపడుతుంది. ఇలా ఆట ముందుకు తీసుకెళ్లట్లేదు కాబట్టే ఒకటి రెండుసార్లు బాలాదిత్యపై నాగార్జున ఫైర్ అయ్యారు. అయినా సరే బాలాదిత్య బిగ్ బాస్ కోసం తన పద్ధతిని మార్చుకోలేదు. ప్రతి విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా వివరించి విడమరచి చెబుతాడు అయితే అదే అతను చేసిన తప్పు. బిగ్ బాస్ హౌస్ లో గెలవాలంటే కన్నింగ్ అయ్యుండాలి.. ఆట కి ఎవరడ్డు వచ్చినా మీదపడిపోవాలి..
baladitya elemination for cheating bigg boss star maa nagarjuna
అంతేకాదు మెయిన్ ఇంపార్టెంట్ అవతల వారిని మాట్లాడకుండా నోరేసుకుని పడిపోవాలి ఇవన్ని బాలాదిత్య రూల్ బుక్ లో లేవు. అందుకే అతను ఎన్ని వారాలు ఉన్నా ఇంతే అని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యింది. ఫైనల్ గా అతన్ని 10వ వారం ఎలిమినేట్ చేసింది. ఓటింగ్స్ ప్రకారం బాలాదిత్య, వాసంతి లీస్ట్ లో ఉండగా ఈ వారం వాసంతి ఒక్కతే బయటకు వెళ్తుందని అనుకున్నారు కానీ సడెన్ గా డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారమే బాలాదిత్యని ఎలిమినేట్ చేశారు. ఈరోజు వాసంతి కూడా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. సో డబుల్ ఎలిమినేషన్ తో ఒక్కసారిగా హౌస్ మెట్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
This website uses cookies.