Balakrishna gives crazy offer to vashist
Balakrishna : కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన చిత్రం బింబిసార. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కలెక్షన్లతో దూసుకెళ్లుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమాతో హిట్ పడింది. తాజాగా బింబిసార సినిమాను నటసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో చూశారు. బింబిసార టీంపై ప్రశంసలు కురిపించారు. . సినిమా చాలా బాగుందని అన్నారు. అలాగే సినిమాలో భావితరాలకు కావల్సిన సందేశం ఉంది. అందరూ తప్పక చూడండి అంటూ.. తన ఫ్యాన్స్ ను కోరారు బాలయ్య.
కళ్యాణ్ రామ్‌తో పాటు డైరెక్టర్ వశిష్ఠ్‌ను అభినందించిన బాలకృష్ణ చిత్ర దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్ కూడా ఇచ్చారు బాలయ్య. బాలయ్య ఛాన్స్ ఇచ్చాడంటే మాటలు కాదు. మరి బాలయ్య కోసం వశిష్ఠ కథను సిద్ధం చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేనితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ చిత్రం చేయడం.. ఇది బ్లాక్ బస్టర్ సాధించడంతో డైరెక్టర్ వశిష్ట్ కి వరుసగా ఆఫర్స్ క్యూకడుతున్నాయి.
Balakrishna gives crazy offer to vashist
బాలకృష్ణ- వశిష్ట్ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. బాలయ్యతో అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో చేస్తున్న టైమ్ లోనే ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని అడిగారట. బాలయ్య వెంటనే ఓకే చెప్పారట. వశిష్ట్ టాలెంట్ కి ఫిదా అయిన అల్లు అరవింద్ బాలయ్య మూవీ కోసం వశిష్ట్ ను రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే.. వశిష్ట్ కి ఇది బంపర్ ఆఫరే. చూడాలి మరి రానున్న రోజులలో ఎలాంటి ప్రకటన వస్తుందో.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.