Balakrishna play playing cards
Balakrishna : నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. సాంఘిక, పౌరాణిక ఇలా ఎన్నో జానర్స్‌లో తన నటనతో మెప్పించాడు బాలయ్య. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తుండగా, ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ పక్కా మాస్ ఎలివేషన్ ఇచ్చేలా కథను సిద్ధం చేసి సినిమా రూపొందిస్తున్నారు.
వీర శంకర్ రెడ్డి అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేయగా, ఈ మూవీకి సంబంధించి విడుదలైన చిన్న పాటి టీజర్ సినిమాపై ఉన్న ఎక్స్‌ఫెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిపోయింది. అయితే బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తనలో ఉన్న కొన్ని అలవాట్లు మాత్రం ఇప్పటికీ మార్చుకోలేదట. బాలయ్యకు పేకాట ఆడే అలవాటు ఉండగా, దాని గురించి తాజాగా తాజాగా డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను బాలకృష్ణ నటించిన ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాను. అయితే ఆ టైంలో బాలకృష్ణ నాతో ఎంతో సరదాగా ఉండేవారు. షూటింగ్ టైంలో బాలకృష్ణ నన్ను మీకు పేకాట ఆడడం వచ్చా అని అడిగారు. వచ్చు అని చెప్పగానే ఇద్దరం పేకాట ఆడడం మొదలుపెట్టాం.పేకాట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నారు.
Balakrishna play playing cards
కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను సార్ అని ఎంత చెప్పినా వినలేదు, నువ్వు ఇప్పుడు ఆడాల్సిందే అని బాలయ్య పట్టుబట్టారు. ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అంటూ జి. నాగేశ్వర్ రెడ్డి సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న చాలా మంది బాలకృష్ణ పేకాట ఆడతారా అంటూ నోరెళ్లపెడుతున్నారు. ఆయన సరదాగా పేకాట ఆడేవారు తప్ప, ఎప్పుడు కూడా దానికి బానిసై డబ్బులు పోగొట్టుకుంది లేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. షో కి వచ్చే గెస్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానుల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే.
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
This website uses cookies.