Home » Entertainment » Balakrishna Playing Cricket And Hitting Sixers Like Dhoni
Entertainment

Balakrishna : సిక్సర్ లతో మోత మోగించిన బాలకృష్ణ బ్యాటింగ్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 30, 2023, 3:00 pm
Advertisement

Balakrishna : రేపటినుండి దేశంలో ఐపిఎల్ టోర్నీ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ టోర్నీలో తెలుగు వెర్షన్ కామెంట్రీ నటసింహం నందమూరి బాలయ్య బాబు చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు ఇటీవల తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బాలకృష్ణ బ్యాటింగ్ చేస్తూ.. బాల్ నీ సిక్సర్ ల తరహాలో బాగా హీటింగ్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Balakrishna Playing Cricket And Hitting Sixers Like Dhoni

కరోనా రాకముందు బాలయ్య బాబు కేవలం సినిమాలకు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ కరోనా తరువాత బాలకృష్ణ ఓటీటీ రంగంలో అందరిని అలరిస్తున్నారు. తనలో ఉన్న యాంకర్ టాలెంట్ బయటకు తీసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. ఆహా “అన్ స్టాపబుల్” షో… బాలకృష్ణ లో ఉన్న మరో కోణాన్ని చూపించడం జరిగింది. ఈ షో కి సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

Advertisement

ఇటువంటి క్రమంలో ఓటీటీ కంటెంట్ కి సంబంధించి… మంచి మంచి అవకాశాలు బాలయ్యకే వరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఐపిఎల్ టోర్నీ తెలుగు వర్షన్ కామెంట్రీ బాలయ్య చేయబోతున్నారు. ఇందుకుగాను బాలకృష్ణకి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ నిర్వాహకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ…అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణా యాసలో బాలయ్య డైలాగులు పలకనున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి