Home » Entertainment » Balakrishna Reveals His Wife Secret
Entertainment

Balakrishna : ఆ ఒక్క విషయంలోనే భార్యతో తిట్లు తింటా .. సీక్రెట్ చెప్పిన బాలయ్య ..!

Authored By
Suma
The Telugu News | Published on: February 5, 2026, 1:00 pm
Advertisement

Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ  Nandamuri Balakrishna అంటేనే క్రమశిక్షణకు మరో పేరు. ఆయన పేరు వినగానే చాలామందికి గౌరవంతో పాటు ఓ చిన్న భయం కూడా కలుగుతుంది. ఆయనతో మాట్లాడాలంటే రెండుసార్లు ఆలోచిస్తారని ఇండస్ట్రీలోనే టాక్. కానీ దగ్గరగా తెలిసినవాళ్లు మాత్రం బాలయ్య అసలు స్వభావం వేరని చెబుతుంటారు. క్రమశిక్షణలో రాజీ లేకపోయినా మనసు మాత్రం చాలా సరదాగా ఉంటుందట. అలాంటి బాలయ్య జీవితంలో ఓ చిన్న అలవాటు మాత్రం ఆయనకు ఇంట్లో భార్య వసుందర చేత తిట్లు తెప్పిస్తోందట. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

Advertisement

Balakrishna : ఆ ఒక్క విషయంలోనే భార్యతో తిట్లు తింటా .. సీక్రెట్ చెప్పిన బాలయ్య ..!

Balakrishna : క్రమశిక్షణకు ప్రతిరూపం బాలయ్య

సీనియర్ ఎన్టీఆర్  Senior NTR  నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రి చూపించిన క్రమశిక్షణను discipline  అక్షరాలా ఫాలో అవుతున్నారు. సినిమా అయినా వ్యక్తిగత జీవితం అయినా కొన్ని నియమాలు తనకు తానే పెట్టుకుని వాటిని తప్పకుండా పాటిస్తారు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి పూజలు చేయడం, షూటింగ్ టైమ్ కంటే ముందే సెట్స్‌కి చేరుకోవడం లాంటి అలవాట్లు ఆయన దగ్గర నుంచి చాలా మంది నేర్చుకోవాల్సిన విషయాలే. దర్శకుడు ఎంత చిన్నవాడైనా, కొత్తవాడైనా సరే అతని మాటే ఫైనల్ అని నమ్ముతారు బాలయ్య. రీటేక్ అడిగినా మొహమాటం లేకుండా చేస్తారు. దర్శకుడి డ్యూటీలో ఎప్పుడూ వేలు పెట్టరు. సినిమా అంటే ఆయనకు ఓ యజ్ఞంలాంటిది. అందుకే సెట్స్‌లో టీమ్ అంతా కలిసి సరదాగా ఉంటూ పని మాత్రం పక్కాగా చేస్తారు.

Advertisement

Balakrishna : ప్రొడక్షన్ ఫుడ్ పై ప్రేమ… ఇంట్లో మాత్రం క్లాస్!

బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకమైన అలవాటు  special habit  ఏంటంటే ఎక్కడ షూటింగ్  Shooting జరిగినా సరే ప్రొడక్షన్ నుంచి వచ్చే భోజనం  Production food  మాత్రమే తినడం. ఔట్‌డోర్ షూటింగ్ అయితే ఓకే హైదరాబాద్‌లో అదీ ఇంటికి దగ్గరలో షూటింగ్ జరిగినా కూడా ఇంటి భోజనం వద్దనే అంటారట. ఈ విషయంలో ఆయన భార్య వసుందర చాలాసార్లు బాలయ్యను తిడుతుంటారని ఆయనే ఓ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు. ఇంటిపక్కనే షూటింగ్ జరుగుతున్నా ఇంట్లో వండి క్యారియర్ పంపిస్తాను అంటే ఎందుకు వద్దంటావు? అని వసుందర అడుగుతారట. హైజనిక్ కదా అని చెప్పినా బాలయ్య మాత్రం “సినిమానే మనకు అన్నం పెట్టింది. ఇండస్ట్రీ ఇచ్చిన ఫుడ్డు తింటేనే నాకు ఈ హుషారు” అని సరదాగా సమాధానం ఇస్తారట. ఈ అలవాటు వల్లే తన ఆరోగ్యం బాగుందని ఇప్పటికీ కుర్రాడిలా ఉన్నానని బాలయ్య గర్వంగా చెబుతుంటారు.

Balakrishna : 65 ఏళ్లకూ తగ్గని జోరు… వరుస విజయాలు

ఇక పోతే బాలకృష్ణ కెరీర్  Balakrishna Career  విషయానికి వస్తే 65 ఏళ్ల వయసులో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘అఖండ’ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇటీవల ‘అఖండ 2’తో యావరేజ్ రిజల్ట్ వచ్చినా బాలయ్య క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక తదుపరి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుందన్న టాక్ కూడా జోరుగా సాగుతోంది. క్రమశిక్షణ, డిసిప్లిన్, అంకితభావంతో పాటు తనదైన స్టైల్‌తో బాలయ్య ఇంకా ఎంత దూరం వెళ్లబోతున్నాడో చూడాలి. అభిమానులకు మాత్రం బాలయ్య అంటే ఎప్పటికీ ఎనర్జీ ప్యాకెట్‌నే.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి