
Balakrishna super performance in Veera Simha Reddy Movie
Veera Simha Reddy Movie : నటసింహం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. సంక్రాంతికి వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే బాలకృష్ణ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈరోజు ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ కూడా ఈరోజు విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించి మాటల రచయిత బుర్ర సాయి మాధవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని చెప్పిన రివ్యూస్ లకు బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా నటించిన కన్నడ నటుడు దునియా విజయ్ సినిమా గురించి హైలెట్ న్యూస్ చెప్పాడు. అసలు ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీలయ్యానని, ఈ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతుందని తెలిపారు. అసలు ఈ పాత్రకు నన్ను ఎందుకు తీసుకున్నారని డైరెక్టర్ ని అడిగాను.
Balakrishna super performance in Veera Simha Reddy Movie
గోపీచంద్ గతంలో నా వర్క్ చూసి ఆ పాత్రకి మీరైతే సూట్ అవుతారని అందుకే తీసుకున్నారని విజయ్ చెప్పారు. ఈ సినిమాలో నా లుక్ చాలా మొరటుగా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాపరెడ్డి అంటూ ఈ సినిమాను మరింతగా హైలెట్ చేశాడు. సినిమా కథంతా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య నటన చూస్తే ప్రేక్షకులు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అని అన్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.