
balakrishna unstoppable with nbk show with bramhanandam
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ చిత్రం విజయోత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సరి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ భారీ స్థాయిలో వసూళ్లు తెచ్చి పెడుతోంది. మరోవైపు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే షో కూడా విజయవంతంగా దూసుకెళ్తుంది. మొదటి ఏపీసొడ్ లో మోహన్ బాబు, రెండో ఏపీసొడ్ లో నాని తో కలసి బాలయ్య రచ్చ రచ్చ చేయగా.. మూడో ఎపిసోడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి షోకు హాజరై సందడి చేశారు. తన సొంత విషయాలను అభిమానులతో ఎప్పుడూ పెద్దగా పంచుకోని బాలయ్య.. తాజాగా ఈ షో లో షోలో తన పర్సనల్ మ్యాటర్స్ ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.
బేసిక్ గా తాను సినిమాలను థియేటర్లో తక్కువగా చూస్తానన్న బాలయ్య.. ఒకవేళ సినిమా నచ్చకపోతే హాల్ లోనే పడుకుంటానని, మరి బాగలేకపోతే హాల్ నుంచి లేచి వెళ్లిపోతానని అన్నారు. ఇక పాటలు విషయానికొస్తే… తాను వాటిని అస్సలు చూడనని చెప్పారు. అయితే ఇలాంటివి తన భార్య వసుంధరకు నచ్చవని అన్నారు. అలా చేస్తే తనకు చాలా కోపం వస్తుందని అన్నారు. సినిమాకు వెళ్ళినప్పుడు షో నడుస్తుండగా.. హాల్ నుండి వెళ్లిపోవద్దని, పాటలు వచ్చినా.. నిద్ర పోకూడదని తన భార్య తనను ఒట్టు వేయించుకున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు.
balakrishna unstoppable with nbk show with bramhanandam
ఇక టాపిక్ మార్చి మళ్ళీ సినిమాల వైపు వచ్చిన బాలయ్య షోకు అతిథిగా హాజరైన బ్రహ్మానందాన్ని ఇబ్బంది పెడుతూ మీకు ఇష్టమైన హీరో ఎవరంటూ ఓ ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లో నీకు ఎవరంటే ఇష్టమని ఆప్షన్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన బ్రహ్మానందం.. ఏఎన్నార్ అంటే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగక.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ తనకు రెండు కళ్ళ లాంటి వారని చెప్పుకొచ్చారు. ఇలా బ్రహ్మి, అనిల్ రావిపూడిలతో సరదాగా సాగిపోయిన షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రం ఉంటుందని బాలయ్య ప్రకటించారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.