Bandla Ganesh About On Chiranjeevi
Bandla Ganesh బండ్ల గణేష్ Bandla Ganesh సోషల్ మీడియా Social Media లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ట్వీట్లు, చెప్పే మాటలు, షేర్ చేసే కొటేషన్లు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్‌కు గత ఏడాది కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కోలుకుని బయటకు వచ్చిన బండ్ల గణేష్ పూర్తిగా మారిపోయాడు. వేదాంతధోరణిని ఎత్తుకున్నాడు.
Bandla Ganesh About On Chiranjeevi
పూర్తిగా రాగద్వేషాలకు దూరంగా ఉండిపోయాడు. ఉన్నంత కాలం మంచిగా ఉండాలని కరోనా నేర్పిందని చెప్పుకొచ్చాడు.అయితే బండ్ల గణేష్ Bandla Ganesh కు రెండో సారి కూడా కరోనా వచ్చింది. ఈ విషయం మీడియాలో ఎక్కువగా రాలేదు. కానీ అది చాలా సీరియస్ అయిందట. ఇంటిల్లి పాది కరోనాతో కొట్టుమిట్టాడారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తనకు రెండో సారి కరోనా వచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.
Bandla Ganesh About On Chiranjeevi
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానే కరోనా వ్యాప్తి చెందింది. ఆ ఈవెంట్‌లో పాల్గొన్న వారిలో చాలా మందికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.కరోనా రావడం, అది చాలా సీరియస్ అవ్వడం, లంగ్స్ మొత్తం పాడయ్యాయట. ఇక ఒక్కరోజు ఆలస్యం అయితే చచ్చిపోయే వాడిని అని చెప్పాడు. అప్పుడు ఏ హాస్పిటల్‌కి ఫోన్ చేసినా సరే ఎవ్వరూ బెడ్స్ లేవని అన్నారు. చివరకు అపోలోకి కూడా చేశాను. వారు కూడా లేవని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు చేద్దామని అంటే.. ఆయనకు కూడా అప్పుడే కరోనా వచ్చింది.
ఇక చిరంజీవికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాను.. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు.. ఆయన వెంటనే ఫోన్ పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేసేశారు అని బండ్ల గణేష్ నాటి విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు మళ్లీ జీవితాన్ని ఇచ్చాడు అని చిరంజీవి గురించి బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.