Bandla Ganesh యాంకర్ సుమ బుల్లితెరపై ఎన్నో ఏళ్లు అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. తెలుగులో టాప్ యాంకర్ అనే మాటే వినిపించదు. ఎందుకంటే అది సుమకు సొంతమైంది. సుమకు ధీటుగా ఎంతో మంది అందంతో ఆకట్టుకునేందుకు వచ్చారు. కానీ సుమ వాగ్దాటి ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. అలా సుమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నెంబర్ వన్‌గా దూసుకుపోతూనే ఉంటుంది. అయితే సుమ వయసు మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సుమ కూడా తన వయసుని బయట పెట్టేందుకు అంతగా ఇష్టపడదు.
ఎప్పుడూ తన వయసు పదహారే అన్నట్టుగా చెబుతుంటుంది. ఇక సుమ తన అందం మీద కూడా ఎన్నో సెటైర్లు వేసుకుంటుంది. మేకప్ వేసుకుంటానని, మేకప్ లేకపోతే చూడలేరంటూ తన మీద తానే కౌంటర్లు వేసుకుంటుంది. అయితే తాజాగా క్యాష్ షోలో తన అందం మీద చర్చ వచ్చింది. వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు. ఇందులో భాగంగా బండ్ల గణేష్ సుమ అందం గురించి కామెంట్ చేశాడు.
బండ్ల గణేష్‌కు కోళ్ల ఫాంలున్నాయని తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా టమాటల రేటు ఎంత అని సుమ అడుగుతుంది. అవన్నీ మాకు తెలియవు.. కోడిగుడ్డు ధర ఎంతో అడగండి చెబుతాం అని అంటాడు బండ్లన్న. దీంతో సుమతో పాటు మిగతా అందరూ నవ్వుతారు. మీరు పంపే గుడ్లతోనే అందరం తింటున్నాం అని సుమ అంటే.. అవును మరి కోడిగుడ్డు లేకపోతే జీవితం లేదు.. ఆ కోడి గుడ్లు తినే ఇంత అందంగా తయారయ్యావ్ అని బండ్ల గణేష్ అంటాడు. దీంతో మధ్యలోకి సమీర్ ఎంట్రీ ఇస్తాడు.
ఇన్నాళ్లకు సుమ అందానికి రహస్యం తెలిసింది.. కోడి గుడ్లన్న మాట అని సమీర్ కౌంటర్ వేస్తాడు. ఈ రోజు అద్దంలో చూసుకుంటే నాకు నేను కోడిలా కనిపిస్తానా? అని సుమ తన మీద తానే సెటైర్ వేసుకుంది. దీంతో బండ్ల గణేష్, సమీర్ పగలబడి నవ్వేస్తుంటారు.
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
This website uses cookies.