Home » Entertainment » Bhanu Sri Says Ashu Reddy Always Busy With Phone
Entertainment

Ashu Reddy : ఎప్పుడూ అదే పని.. అషూ రెడ్డి గుట్టువిప్పిన భాను శ్రీ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 20, 2021 8:57 am
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ తెలుగు బ్యూటీస్.. అషూ రెడ్డికి Ashu Reddy , భాను శ్రీకి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. భాను శ్రీ బిగ్‌బాస్‌ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయగా, అషూ రెడ్డి బిగ్ బాస్‌ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీరిద్దరికి బయట కూడా మంచి క్రేజ్ ఉంది. బయట మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరు ఇటీవల ఓ పబ్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా అషూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

అందులో భాను శ్రీని.. మై సూపర్ క్వీన్ అంటూ అషూ రెడ్డి కామెంట్స్ చేసింది. ఇక పబ్‌లో భాను శ్రీ, అషూ రెడ్డి చాలా ఫన్‌గా గడిపినట్టుగా తెలుస్తోంది. ఒకరినొకరు కౌగిలించుకుని ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా అషూ రెడ్డిపై భాను శ్రీ ఓ ఫన్నీ కంప్లైయింట్ చేసింది. అదేమిటంటే.. అషూ రెడ్డి ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టింది.

bhanu sri says ashu reddy always busy with phone

Advertisement

Ashu Reddy : మిడ్ నైట్ పార్టీలో అషూ, భాను శ్రీ రచ్చ..

అయితే భాను శ్రీకి.. అంతే ఫన్నీగా అషూ రెడ్డి కూడా రిప్లై ఇచ్చింది. యస్ మై డియర్ అని పేర్కొంది. అంతేకాకుండా ఓ లవ్ ఎమోజిని కూడా యాడ్ చేసింది. మరోవైపు వారిద్దరి కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన భాను శ్రీ.. క్యూటీస్ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫేసెస్‌ హ్యాష్ ట్యాగ్‌లు కూడా జత చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి