Home » Entertainment » Bheemla Nayak Anthaistam Song
Entertainment

Bheemla Naik : పవన్ ఫ్యాన్స్‌కు దసరా బొనాంజా.. భీమ్లానాయక్ నుంచి మరో ప్రొమో సాంగ్..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 14, 2021, 12:14 pm
Advertisement

Bheemla Naik : దసరా పండుగను పురస్కరించుకుని పవర్ స్టార్ అభిమానులకు భీమ్లా నాయక్ చిత్ర బృందం శుభవార్త చెప్పింది. ‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి మరో ప్రొమో సాంగ్‌ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ‘అంత ఇష్టం’ అంటూ మొదలయ్యే పల్లవి పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నట్టు తెలిసింది. ఈ ప్రొమో సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Advertisement

Bheemla Nayak AnthaIstam Song

Bheemla Naik : భీమ్లాతో రికార్డులు బ్రేక్ అంటున్న ఫ్యాన్స్

మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్‌’ తెలుగు అనువాదంగా ‘భీమ్లా నాయక్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సాగ‌ర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి పవన్‌కు ప్రతినాయకుడిగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లేను అందిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ‘భీమ్లా నాయక్‌’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో పవన్ కనిపించనున్నాడని టాక్.

Advertisement

భీమ్లా నాయక్ సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో నిర్మాణమవుతోంది. పవన్ సరసన నిత్యా మీనన్ యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏదైమైనా భీమ్లానాయక్ మూవీ గత నాన్ బహుబలి రికార్డులను మరోసారి తిరగరాస్తుందని అభిమానులు గంపెడాశలతో ఉన్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి