Home » Entertainment » Bheemla Nayak Pawan Kalyan Look Leaked
Entertainment

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ నుండి మ‌రో లీక్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అవతారం చూసి ఉలిక్కిప‌డుతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 17, 2022, 1:30 pm
Advertisement

Bheemla Nayak : పెద్ద సినిమాలకు లీక్ కష్టాలు తప్పట్లేదు. ముఖ్యంగా మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్, చిరంజీవి వంటి స్టార్ల సినిమాల‌కు సంబంధించి ఏవో లీకులు జ‌రుగుతూనే ఉంటాయి. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట నుండి క‌ళావ‌తి సాంగ్ విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావించ‌గా, ఆ పాట ముందే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చింది. దీంతో చెప్పిన స‌మ‌యం కంటే ముందే పాట‌ని విడుద‌ల చేశారు. ఇక టైటిల్ సాంగ్ లోడింగ్ అంటూ ఊరించిన “భీమ్లా నాయక్” నిర్మాతలకు ఎదురు దెబ్బ తగిలింది. ‘భీమ్లా నాయక్’ పాటలోని ఒక డ్యాన్స్ బిట్ ఇంటర్నెట్‌లో లీక్ అయింది. వెంటనే ఆ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెట్‌లో స‌రికొత్త లుక్‌తో క‌నిపించిన పిక్ ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్తగా.. వింతగా కనిపిస్తే.. ఎవరికి చూడాలని ఉండదు. సరిగ్గా అలాంటి లుక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్ లో ఉన్న లుక్ ఒకటి.. సినిమా షూటింగ్ నుంచి లీక్ అయ్యి.. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తెల్ల పంచ, తెల్ల చొక్క..బుజం మీద నల్లటి గొంగళి, చేతిలో ముల్లు కర్ర, ఆముల్లు కర్రకు ఎర్ర తువ్వాలు.. కాలికి కడియం.. కిర్రు చెప్పులు వేసుకుని పవర్ స్టార్ కొత్త గెటప్ లో సరికొత్తగా కనిపించారు.ఏదో పాట షూటింగ్ కోసం ఈ అవతారం ఎత్తినట్టు సమాచారం.

bheemla nayak Pawan Kalyan look leaked

Advertisement

Bheemla Nayak : లీకుల ప‌ర్వం…

అయితే ఈ గెటప్ భీమ్లా నాయక్ సినిమాలోది అని తెలుస్తోంది. ఇందులో ఓ పాట కోసం పవన్ ఇలా మారాడట.నిన్న‌టితో చిత్ర షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి 25న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నార‌ట‌. వారం రోజుల్లో సినిమాని ఏ రేంజ్‌లో ప్ర‌మోట్ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. సాగర్ కే చంద్ర ఈసినమాను డైరెక్ట్ చేయగా.. మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. తమన్ మ్యూజిక్ చేసిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా కు జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోంది.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి