Home » Entertainment » Big Boss Contestant Ariyana Glory Comments About Personal Life
Entertainment

Ariyana : అరియాన వైరల్ కామెంట్స్… మెంటల్ టార్చర్ తట్టుకోలేక… ఐ లవ్ యు చెప్పా…

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 14, 2022, 1:30 pm
Advertisement

Ariyana  : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అరియానా మాత్రం బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. బిగ్ బాస్ లోకి అరియాన ఒక్కసారి కాదు రెండుసార్లు అడుగుపెట్టి మరింత పాపులర్ అయింది. తన ఆట తీరుతో యువకుల మనసులను కొల్లగొట్టింది. గత మూడు సంవత్సరాలుగా బిగ్ బాస్ కి దత్త పుత్రికగా మారింది ఈ అమ్మడు. కేవలం బిగ్ బాస్ నే కాదు యూట్యూబ్ స్టార్ గా కూడా ఫుల్ పాపులర్ అయింది. ఏం చేసినా ఎల్లప్పుడూ వార్తల్లో నిలవాలి, అందరికీ నా పేరు సుపరిచితం కావాలి అని ఎక్కువగా ఆలోచిస్తుంది ఈ బ్యూటీ. అందుకనే ఆ వైపుగానే అడుగులు వేస్తూ జనాల నోళ్ళలో నానుతుంది.

Advertisement

అలాగే అరియానా సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చి టాప్ 4 లో నిలిచింది అరియాన. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి రీ ఎంట్రీ ఇచ్చి అందరిని ఎంతగానో అలరించింది. టాప్ ఫైనలిస్టుగా 10 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకుంది. కాకపోతే సీజన్ 4 లో కనబరిచిన ఆట తీరుని ఓటీటీలో ప్రదర్శించలేకపోయింది. అరియానా బిగ్ బాస్ తర్వాత రాంగోపాల్ వర్మతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Big boss contestant Ariyana glory comments about personal life

Advertisement

అంతేకాకుండా ఈ వీడియోలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. బిగ బాస్ దత్తపుత్రికను నేను అని చెప్పిన అరియానా, అందుకే కెమెరాల దగ్గరికి వెళ్లి అన్నిసార్లు బిగ్ బాస్ కి ఐ లవ్ యు అని చెప్పేదాన్ని, సీజన్ 4 లో బిగ్ బాస్ కి ఎక్కువసార్లు ఐ లవ్ యు చెప్పానని అరియాన చెప్పుకొచ్చింది. సీజన్ 4కి వెళ్ళినప్పుడు కప్పు కొట్టాలని ఉద్దేశంతో వెళ్లాను. అందుకే గేమ్స్ కూడా బాగా ఆడాను. కానీ ఓటీటీకి వచ్చేసరికి కొత్త వాళ్లే కప్పు గెలవాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా పాపులారిటీ పెరగాలని అందుకే బిగ్ బాస్ ఓటీటీ కి వచ్చా తప్ప కప్పు గెలవాలని రాలేదు అని అరియాన చెప్పింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి రెండవసారి వచ్చి ఆడటం అనేది మెంటల్ టార్చర్ అని అరియానా చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి