ప్రస్తుతం ఇండియాలో సాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, హిందీ, తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో సక్సస్ ఫుల్ గా సాగుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 13 వ సీజన్ సాగుతుండగా తెలుగు, తమిళంలో సీజన్ 4 సక్సస్ ఫుల్ గా కంప్లీట్ కాబోతోంది. కాగా తమిళంలో ఈ సీజన్ 4 కి లోకనాయకుడు కమల్ హాసన్.. మన తెలుగులో కింగ్.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి మంచి టీఅర్‌పి రేటింగ్ తో సాగుతోంది.
చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగులో కంప్లీట్ అయిన 3 సీజన్స్ కంటే ఈ 4వ సీజన్ కే ఎక్కువ రేటింగ్ వచ్చిందట. ఇక కరోనా సినిమాల షూటింగ్స్ .. రిలీజ్ లని ఆపినప్పటికి బిగ్ బాస్ ని మాత్రం ఆపలేకపోయింది. అంటే ప్రేక్షకుల్లో ఈ షో కి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. ఇక ప్రతీవారం నామినేషన్స్ .. ఎలిమినేషన్స్ అంటూ కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులను బాగా సర్‌ప్రైజెస్ ఇచ్చి షాకులిచ్చి ఎంటర్‌టైన్ చేశారు. మొత్తానికి సీజన్ 4 చివరి దశకి చేరుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే భారీ స్థాయిలో ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.
గత సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులని ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి ఈసారి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ని తీసుకురాబోతున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలే లో ఆ సినిమాల విషయాలను కూడా పంచుకునే అవకాశం ఉంటుందన్న ప్రేక్షకుల స్ట్రాటజీ ని బాగా ఉపయోగించుకోవాలన్న ప్లాన్ తో ఇలా మెగాస్టార్, ఎన్,టి.ఆర్ లని తీసుకు రాబోతున్నట్టు సమాచారం. ఇక టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలుస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మెగాస్టార్ ఎంట్రీకి ఒక హీరోయిన్, ఎన్.టి.ఆర్ ఎంట్రీకి ఒక హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. వారే మెహ్రీన్, రాయ్ లక్ష్మీ.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.