Bigg Boss Inaya Sultana : ఇనయా సుల్తానా ఫుల్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?
Bigg Boss Inaya Sultana : బిగ్ బాస్ సీజన్ సిక్స్,Bigg Boss season six, లో ఇనయా సుల్తానా ఎలిమినేట్ కావటం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. ఈ సీజన్ లో స్టార్టింగ్ నుండి ఒంటరిగా గేమ్ ఆడింది. హౌస్ మొత్తం ఏకమైన గాని.. ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మగవాళ్ళతో సైతం పోటీ పడటం జరిగింది. ఇనయా సుల్తానా, Inaya Sultana, బిగ్ బాస్,Bigg Boss లో రోజురోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ పోయింది.
ఈ క్రమంలో ఆమె ఆట తీరు నచ్చడంతో నామినేషన్ లో ఉన్న ప్రతిసారి ఎక్కువ ఓట్లు కూడా రాబట్టింది. దీంతో కచ్చితంగా టాప్ 5.. ఫైనలిస్టులలో ఇనయా బెర్త్ కన్ఫామ్ అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సరిగ్గా ఫైనల్ వారానికి ముందు ఇనయా ఎలిమినేట్ కావటం తెలిసిందే. అయితే ఇనయా ఎలిమినేషన్ వెనకాల… కొన్ని కుట్రలు ఉన్నట్లు టాక్. బీబీ టీం ఫేవరెట్ కంటెస్టెంట్లను చివరి వారంలో గెలిపించుకోవడం కోసం ఇనయా సుల్తానానీ ఎలిమినేట్ చేసినట్లు భావిస్తున్నారు.
bigg boss 6 Inaya Sultana full remuneration details
ఇదంతా పక్కన పెడితే హౌస్ లో 14 వారాలకు గాను…వారానికి 15 వేల రూపాయలు చొప్పున.. మొత్తంగా.. రెండు లక్షల పదివేల రూపాయలు ఇనయా సుల్తానాకి బీబీ యాజమాన్యం అందించినట్లు సమాచారం. అయితే ఆమె ఓటింగ్ పరంగా కాకుండా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసినట్లు బయట జనాలు భావిస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. దీంతో ఎవరు టాప్ 5లో ఉంటారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.
