
Bigg Boss 6 Telugu 2nd week nomination list and geethu in danger zone
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్ గత సీజన్లన్నింటికంటే కాస్త భిన్నంగా సాగుతోంది. ప్రతీ సీజన్‌లో మొదటి వారం నామినేషన్ ఎలిమినేషన్స్ కచ్చితంగా జరిగేవి. కానీ ఈ సీజన్‌లో మాత్రం మొదటి వారం నో ఎలిమినేషన్ అని పెట్టారు. ఇంకా కంటెస్టెంట్లు సదురుకోలేదని వింత కారణం చెప్పి నో ఎలిమినేషన్ అని ప్రకటించాడు నాగ్. ఆ కారణం ఎంత వరకు కరెక్ట్ అన్నది బిగ్ బాస్ టీంకే తెలియాలి. ఇక ఈ రెండో వారం నామినేషన్స్‌లోనూ కాస్త వెరైటీ పద్దతిని ఫాలో అయ్యారు.మామూలుగా అయితే ప్రతీ సారి ఒక్కో కంటెస్టెంట్‌కు ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చేవాడు.
కానీ ఇంట్లొ 20 మంది ఉండటంతో ఒక్కొక్కరికి ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు. చివరకు ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్ అయిన బాలాదిత్యకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్‌లో సిల్లీ సిల్లీ కారణాలు వినిపించాయి. జంటగా వచ్చారని మెరినా రోహిత్‌ను నామినేట్ చేశాడు ఆదిరెడ్డి.దీంతో ఆది రెడ్డికి హైట్ అనే అడ్వంటేజ్ ఉందని ఇనయ అతడిని నామినేట్ చేసింది. ఇలా పిచ్చి పిచ్చి కారణాలతో నామినేషన్ ప్రక్రియ సాగింది. ఒక్క ఓటు పడ్డ కంటెస్టెంట్లు కూడా నామినేషన్లోకి వచ్చేశారు. ఫైమాకు ఒక్క ఓటే పడింది. కానీ నామినేషన్లోకి వచ్చేసింది. ఆమెను వాసంతి నామినేట్ చేసింది.
Bigg Boss 6 Telugu 2nd week nomination list and geethu in danger zone
తనతో సరిగ్గా మాట్లాడటం లేదని,చూసి నవ్వడం లేదని నామినేట్ చేసింది. ఆ కారణంతో ఫైమా బాధపడింది. అయితే మొత్తానికి ఈ వారం మాత్రం అభినయ, షానీ, రాజ్, రేవంత్, గీతూ, మెరినా రోహిత్ వంటివారు నామినేషన్లోకి వచ్చారు. ఈ సారి ఎవరికి మూడుతుందో చూడాలి. అయితే అభినయ మొదటి వారంలోనే నామినేట్ కావాల్సింది. మరి ఈ వారం కూడా ఆమెనే జనాలు ఇంటికి పంపించేస్తారా? అన్నది చూడాలి. కానీ ప్రస్తుతం గలాట గీతూకు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమెను ఎలిమినేట్ చేసేద్దామనే కసి మీద ఆడియెన్స్ ఉన్నారని అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.