Home » Entertainment » Bigg Boss 6 Telugu Revanth As Pushpa Raj In Nominations
Entertainment

Bigg Boss 6 Telugu : నామినేషన్స్ లో ‘పుష్ప రాజ్’ యాటిట్యూడ్ తో రేవంత్.. మైలేజ్ పెంచే ఎపిసోడ్..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 18, 2022, 1:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రతి వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ అని చెప్పొచ్చు. సింగర్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉన్న అతను ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా హౌస్ లోకి వచ్చాడు. అయితే అతని మాట తీరు సరిగా లేకపోవడం వల్ల మిగతా హౌజ్ మెట్స్ అందరు అతై మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవతల వారిని మాట్లాడనివ్వకుండా తను చెప్పిందే కరెక్ట్ అంటాడని రేవంత్ మీద ఓ కంప్లైంట్ ఉంది. అయితే దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రేవంత్. అంతేకాదు తనకు వచ్చే ఆగ్రహాన్ని కూడా తగ్గించుకుంటూ వస్తున్నాడు.

Advertisement

అయితే హౌజ్ లో పరిస్థితి ఇలా ఉంటే ఆరు వారాల్లో కంటిన్యూస్ గా ఐదు వారాలు నామినేషన్స్ లో ఉంటూ వచ్చాడు రేవంత్. ఆ ఒక్క వారం కూడా అతను కెప్టెన్ కాబట్టి అతన్ని వదిలేశారు. రీసెంట్ గా ఎలిమినేట్ అయిన సుదీపా వెళ్తూ వెళ్తూ కూడా రేవంత్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. అయితే ఆడియన్స్ లో మాత్రం రేవంత్ మీదే ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. ఓటింగ్ పర్సెంటేజ్ లో రేవంత్ ముందు ఉంటున్నాడు. అతని తర్వాతే వేరే వాళ్లు ఉంటున్నారు. ఇక ఇదిలాఉంటే ఏడవ వారం నామినేషన్స్ లో మళ్లీ రేవంత్ మీద హౌజ్ మెట్స్ నామినేషన్స్ వేశారు. ఈసారి నామినేషన్స్ వెరైటీగా బకెట్ లో బురద చల్లే కార్యక్రమం ఏర్పాటు చేశాడు బిగ్ బాస్.

Bigg Boss 6 Telugu revanth as pushpa raj in nominations

Advertisement

అయితే హౌజ్ మెట్స్ ఎక్కువ మంది తననే టార్గెట్ చేయడంతో ఆ బురద పడే క్రమంలో షర్ట్ విప్పేసి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అది చూస్తే పుష్ప సినిమాలో ఊర మాస్ అల్లు అర్జున్ ని చూసినట్టుగానే ఉన్నాడు రేవంత్. పుష్ప రాజ్ లా కూర్చోవడమే కాదు.. నీయవ్వ తగ్గేదేలే అన్నట్టుగా రేవంత్ చేతితో చూపించి వచ్చేశాడు. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా రేవంత్ కి మంచి మైలేజ్ తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఓటింగ్ లో టాప్ లో ఉన్న రేవంత్ ఇంకా రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓ విధంగా హౌజ్ మెట్స్ మీద తన యుద్ధం ప్రకటించినట్టుగా ఉన్నాడు రేవంత్. తన పక్కనే ఉంటూ తననే నామినేట్ చేసిన శ్రీ సత్య లాంటి వారి మీద ఎక్కువ ఫైర్ మీద ఉన్నాడు రేవంత్.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి