
Bigg Boss 8 Telugu : ఎలా పంపిస్తారో చూస్తా.. బిగ్ బాస్ దగ్గర తెగ మారాం చేసిన నైనిక..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎపిసోడ్ లో అనుకోని ట్వీస్ట్ లు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే మెగా చీఫ్ ఎన్నికలో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు కనిపించాయి. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయిటికి వెళ్లడానికి నామినేట్ అయ్యారు.. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారు.. ఇప్పటివరకూ ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ఈరోజుకి సేఫ్‌గా ఉన్నారు..” అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక మణికంఠ సేఫ్ అనగానే యష్మీ షాక్ అయింది.తర్వాత “ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈరాత్రికి ఇంటిని వదిలి వెళ్లనున్నారు.. మీ ముగ్గురు మీ బ్యాగ్స్ను సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి..” అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
విష్ణుప్రియ, ఆదిత్య ఇద్దరూ తమ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు కానీ నైనిక మాత్రం నేను బట్టలే ప్యాక్ చేయను మీరు ఎలా పంపిస్తారో చూస్తా బిగ్‌బాస్ అంటూ మారాం చేసింది. ఇక తర్వాత ఎగ్జిట్ గేటు దగ్గర రెడ్ లైన్స్ పెట్టాడు బిగ్‌బాస్. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక.. మీరు మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. “మీ లెక్క ప్రకారం ఎవరు ఈరోజు రాత్రికి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారని అనుకుంటున్నారో వాళ్లని ఒకడుగు ముందుకు తీసుకొచ్చి వారే ఎందుకు వెళ్తారని అనుకుంటున్నారో కారణాలు చెప్పండి..” అంటూ హౌస్‌మెట్స్‌ను కోరాడు బిగ్‌బాస్. హౌస్‌లో నలుగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు.
Bigg Boss 8 Telugu : ఎలా పంపిస్తారో చూస్తా.. బిగ్ బాస్ దగ్గర తెగ మారాం చేసిన నైనిక..!
తర్వాత “మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య..” అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరికీ తనదైన స్టయిల్లో ఐ లవ్ యూ అంటూ చెప్పి బైబై చెప్పేశాడు ఆదిత్య. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు.. మిగిలిన వాళ్ల ఓటింగ్ కొనసాగుతుంది.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. అయితే ఇక్కడే మరో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మణికంఠ గురించి మనం అనుకుంటున్నట్టుగానే హౌస్ అంతా టార్గెట్ చయడం వల్ల.. అతనిఓటింగ్ భారీగా పెరుగుతుంది. అమాయకుడిని బలి చేస్తున్నారంటూ.. ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటున్న మణిని.. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాపాడుకుంటున్నారు. ఇంట్లో కార్నర్ చేస్తే.. అది అతనికి ప్లాస్ అవుతుంది
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.