Home » Entertainment » Bigg Boss Cant Win The Title Of Shan
Entertainment

Shanmukh : షణ్ముక్ బిగ్ బాస్ టైటిల్ గెలవలేడంటా… కారణం ఆమెనే..

Authored By
mallesh
The Telugu News | Updated on: December 1, 2021 4:58 pm
Advertisement

Shanmukh : బిగ్ బాస్ ఈ గేమ్ షో మీద ఎన్ని రకాల కామెంట్లు వచ్చినా కానీ ఎక్కడా టీఆర్పీ రేటింగ్స్ లో వెనక్కు తగ్గకుండా టెలీ కాస్ట్ అవుతుంది. తాజాగా ఎలిమినేట్ అయిన రవి విషయంలో అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నా కూడా చూసే వారు మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయ్యేందుకు దగ్గరకు వచ్చింది. ఈ సీజన్ లో ఆర్ జే సన్నీయే గెలుస్తాడని అనేక మంది సోషల్ మీడియాలోనూ బయటా కామెంట్లు చేస్తున్నారు. సన్నీ గేమ్ ఆడే పద్ధతి చాలా బాగుందంటూ మెచ్చుకుంటున్నారు.

Advertisement

ఇక యూ ట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ విషయానికి వస్తే మొదట బిగ్ బాస్ ప్రోగ్రాం స్టార్ట్ కాకముందు నుంచే ఆయన బిగ్ హౌజ్ లోకి వెళ్తాడని ప్రచారం జరిగింది. అదే కాకుండా తాను ఈ ఏడాది బిగ్ బాస్ టైటిల్ ను కూడా గెలుచుకుంటాడని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం మాత్రం సీన్ మాత్రం వెరైటీగా ఉంది. షణ్ముక్ జశ్వంత్ సిరి హన్మంత్ తో బిహేవ్ చేసే పద్ధతిపై అనేక మంది నెటిజన్లు నెగెటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన తర్వాత షణ్ముక్ గేమే ఆడలేదు.

bigg boss cant win the title of shan

Advertisement

Shanmukh : ముందు నుంచే..

తర్వాత నాగ్ క్లాస్ తీసుకున్న తర్వాత షన్ను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. కానీ సిరితో బిహేవ్ చేసే పద్ధతి వలన తాను ఎక్కువ మందికి రీచ్ కాలేకపోతున్నాడ. కానీ అదే సమయంలో సన్నీ హౌజ్ లోని అందరితో కలిసిపోతూ అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంటున్నాడు. ఇక మొన్న బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన సిరి అమ్మ కూడా షణ్ముక్ సిరి అలా హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని బహిరంగంగానే ప్రకటించింది. అయినా కూడా షన్ను సిరి ఏ మాత్రం మారడం లేదు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి