Home » Entertainment » Bigg Boss Faima Gets Surprised With Her Boy Friend
Entertainment

Bigg Boss Faima : ప్రియుడి స‌ర్‌ప్రైజ్‌కి ఉబ్బిత‌బ్బిబ్బయిన ఫైమా.. ఊహించ‌ని గిఫ్ట్ అందుకోవ‌డంతో ఫుల్ హ్యాపీ…వీడియో

Authored By
Sam C
The Telugu News | Published on: December 10, 2022, 10:00 am
Advertisement

Bigg Boss Faima : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మొత్తం 21 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో కేవ‌లం ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. వారిలో ఎవ‌రు విన్న‌ర్ అందుకుంటారు అనే ఆస‌క్తి అంద‌రిలో అయితే ఉంది. ఇక చివ‌రిగా బిగ్ బాస్ హౌజ్ నుండి పైమా బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొత్తం 13 వారాలకు గానూ.. ఏకంగా 22 లకారాలు.. ఈమె అందుకుందని టాక్ న‌డుస్తుంది. అంటే మ‌న లెక్క‌ల ప్ర‌కారం అక్షరాలా.. 22 లక్షల.. 75 వేలట. ఆమెకు వారానికి 1, 75, 000 రెమ్యూనరేషన్ ఉండగా.. మొత్తం 13 వారాలకు గానూ 22, 75, 000 రెమ్యూనరేషన్ తీసుకుని ఫైమా లక్షాధికారి ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement

ఫైమా ఇంకో ఐదేళ్లు జబర్దస్త్ చేసుకున్నా ఇంత భారీ అమౌంట్ అందుకునేది కాదనేది అంద‌రికి తెలిసిందే. ఈ అమౌంట్ మొత్తాన్ని ఎలిమినేట్ అయిన వారంలోపు కంటెస్టెంట్ ఖాతాలో జమ చేస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఫైమా ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు అని అనుకున్నారు.ఆమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అని అంద‌రు భావించ‌గా, అంచనాలు తారుమారయ్యాయి. మొదట్లో ఈమె పై చాలా పాజిటివిటీ ఉండేది, కాని వెట‌కారం వ‌ల‌న రాను రాను ఆమె కన్నింగ్ నేచర్ బయటప‌డింది. దీంతో ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు.

Bigg Boss Faima gets surprised with her boy friend

Advertisement

Bigg Boss Faima : స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌..!

నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు ఎలిమినేట్ అయినప్పుడు నా అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. అప్పుడే నేను టాక్ 5 లో ఉండే అవకాశం లేదు అని క్లారిటీ వచ్చేసింది. ‘ అని ఫైమా చెప్పుకు రాగా, ఎలిమినేషన్ గురించి ఆమె ఫీల్ అవ్వడం లేదు అని స్పష్టమవుతుంది. ఇక హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె ప్రియుడు ప్ర‌వీణ్ కేక్ క‌ట్ చేయించాడు. నానా హంగామా చేశాడు. అంతేకాదు క‌డ‌ప ద‌ర్గాలో పూజ చేయించిన నీళ్ల బాటిల్‌ని ఆమెకు ఇచ్చి ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అన్నాడు. అంతేకాదు త‌న మెడ‌లో ఉన్న చెయిన్ తీసి ఫైమా మెడ‌లో వేయ‌డంతో ఫుల్ ఖుష్ అయింది. ఈ హంగామా అంతా త‌న యూట్యూబ్ ద్వారా చూపించింది ఫైమా.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి