Home » Entertainment » Bigg Boss Ott Promo Released
Entertainment

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ అప్‌డేట్.. ప్రోమోతో పిచ్చెక్కించిన నిర్వాహ‌కులు

Authored By
Sam C
The Telugu News | Published on: February 15, 2022, 8:00 pm
Advertisement

Bigg Boss OTT : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మాంచి ఎంట‌ర్‌టైన్ అందిస్తున్న షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తూ వ‌స్తుంది. అయితే ఓటీటీ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని మేక‌ర్స్ అప్‌డేట్ ఇస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఫిబ్రవరి 26న డిస్నీ హాట్ స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున నాగార్జున, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి వారు నటించారు.ఈ ప్రోమోలో నాగార్జునవకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టారు. మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక‌ఈ ప్రోమోలో పిక్ పాకెటింగ్ కేసులో వెన్నెల కిషోర్‌కు ఉరిశిక్ష పడుతోంది.

Advertisement

ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ తన చివరి కోరికగా బిగ్‌బాస్ చూడాలనుకుంటారు. ఈ సందర్భంగా నాన్ స్టాప్‌గా ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ షో కు ఎండ్ ఉండదు. అతనికి ఉరిశిక్ష పడదనే ఫన్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు.అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుందని చెబుతున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్ నుంచి నలుగురైదుగురు పాల్గొనబోతోన్నారట. అందులో సరయు ఉందని సమాచారం.

bigg boss ott promo released

Advertisement

Bigg Boss OTT : ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

ఇక అరియానా, అఖిల్ వంటి వారు కూడా కనిపించబోతోన్నారట.గ‌త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ అయ్యిందని.. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా పాల్గొనబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్ రాజ్, అరియానా, అఖిల్ పాల్గోనబోతున్నారని సమాచారం. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో డీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, శ్రీహాన్ పాల్గోనబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి