Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అంటూ విమర్శలు వస్తున్నాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మరో సారి వారు తీసుకున్న నిర్ణయం కాస్త ప్రేక్షకులకు అసంతృప్తి కలగజేస్తోంది. సాధారణ బిగ్‌బాస్ లో హోస్ట్ వారంలో రెండు రోజులు ప్రేక్షకుల ముందుకు వస్తారు. కానీ బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో మాత్రం హోస్టు గా చేస్తున్న నాగార్జున కేవలం వారం కి ఒక్కరోజు మాత్రమే వస్తారు అని తేలిపోయింది.నిన్న శనివారం ప్రత్యేక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.
కానీ నాగార్జున ఎపిసోడ్ కాకుండా రెగ్యులర్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కేవలం ఆదివారం మాత్రమే నాగార్జున షో కి హాజరు అవుతాడు. వారంలో రెండు రోజులు కాకుండా కేవలం ఆదివారం మాత్రమే ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని క్లారిటీ వచ్చేసింది. ఈ విధానాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికే బిగ్‌బాస్ చూడడానికి బోరింగ్ గా అనిపిస్తుంది కనీసం వీకెండ్స్ లో అయినా నాగార్జున వచ్చి సందడి చేస్తాడు అని భావించారు. కానీ ఇలా చేశారు ఏంటీ అంటూ ప్రేక్షకులు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.
గతంలో వచ్చిన బిగ్‌బాస్ ను ఈ సీజన్ ని పోల్చుతూ తీవ్ర నిరుత్సాహం గురవుతున్నారు. నాగార్జున ఈ సీజన్ కోసం భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో నాగార్జున మరింత జోష్ గా వారంలో రెండు రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆయన ఎంటర్టైన్మెంట్ కేవలం ఒక్క రోజే అని తేలిపోయింది. ఇప్పటికే ఆదరించడం లేదు, నాగార్జున శనివారం రాకపోవడంతో మూలిగే నక్క మీద తాటిపండు చందంగా బిగ్‌బాస్ దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవలసి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.