Bigg Boss Telugu OTT : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన వెంటనే ఓటీటీ బిగ్ బాస్ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరిలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతున్నట్లుగా హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. హాట్ స్టార్ లో బిగ్ బాస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్టార్ కు మంచి క్రేజ్ ఉంటుంది. కనుక అత్యధికులు ఈ బిగ్ బాస్ ను చూస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తెలుగు ఓటీటీ షో లకు దక్కుతున్న ఆధరణ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీకి కూడా మంచి ఆధరణ లభిస్తుందనే నమ్మకం తో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ ఓటీటీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
అన్నపూర్ణ స్టూడియో లో సెట్ నిర్మాణం పూర్తి అయ్యిందట. తక్కువ మంది కంటెస్టెంట్స్ మరియు తక్కువ రోజులు కనుక గత సెట్ తో పోల్చితే ఈసారి సెట్ చాలా చిన్నగా ఉంటుందట. అంతే కాకుండా ఇప్పటి వరకు జరిగిన సీజన్ ల సెట్ లతో పోల్చితే ఈ సెట్ పూర్తి విరుద్దంగా ఉంటుందట. అసలు రెండు ఒక్కటేనా అన్నట్లుగా ఉండేలా సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక్కరు ఇద్దరు ప్రముఖులతో పాటు సోషల్ మీడియా సెన్షేషన్స్.. బుల్లి తెర స్టార్స్ ను ఈ షో కోసం ఎంపిక చేయడం జరిగింది. ఆ జాబితా ఇప్పటికే షో నిర్వహాకులు నాగార్జున వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.బిగ్ బాస్ ను ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా నాగార్జున మరియు నిర్వాహకులు
ప్రకటించినట్లుగానే ఖచ్చితంగా అదే తేదీకి స్ట్రీమింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కంటే చాలా విభిన్నంగా లో బడ్జెట్ తో ఈ బిగ్ బాస్ ఓటీటీ ఉంటుందని అంటున్నారు. తెలుగు బిగ్ బాస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఓటీటీ వర్షన్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ మొదలు పెట్టడం కోసం డేట్ ను లాక్ చేయడం మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ వివరాలను కూడా లాక్ చేయడం జరిగింది. షో కు భారీగా రేటింగ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఓంకార్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.