
Bigg Boss OTT Telugu nonstop bindhu madhavi life interesting facts
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మొదలయ్యి మూడు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ సీజన్ హాట్ ఫేవరెట్గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. ఆమె ఖచ్చితంగా ట్రోఫీ అందుకుంటుంది అనే నమ్మకంతో అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బిందుమాధవి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తూ ఆమె విజయానికి తాము భరోసా అంటూ హడావుడి చేస్తున్నారు. బిందుమాధవి ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యింది అంటే వారు గంపగుత్తగా భారీ మొత్తంలో ఓట్లు వేసి ఆమెను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అఖిల్ ఈసారి విజేతగా నిలుస్తాడని భావించిన సమయంలో అనూహ్యంగా బిందుమాధవి తెరపైకి రావడంతో అతని పేరు హడావుడి తగ్గింది. బిందుమాధవి వ్యవహారం.. ఆమె కామ్ గోయింగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అభిమానులకు బాగా నచ్చింది. అందుకే ఆమెకి ఓట్లు వేస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
హీరోయిన్గా తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించిన బిందు మాధవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.. బిందు మాధవి మొదటి సినిమా ఆవకాయ బిర్యాని ఆ తర్వాత రెండో సినిమాగా తమిళ సినిమాలు చేసింది.మళ్లీ మూడో సినిమాగా పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన బంపర్ ఆఫర్ సినిమాలో నటించింది. పూరి సినిమా అవడంతో బంపర్ ఆఫర్ కి మంచి సక్సెస్ దక్కింది. దాంతో ఆ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ మాధవి పరిచయమైన సమయంలో తాను ఒక తెలుగు అమ్మాయి అని చెప్పకుండా నార్త్ కు చెందిన అమ్మాయిని అని పరిచయం చేసుకుంది. ఆ సమయంలో నార్త్ అమ్మాయిల కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో తాను తెలుగమ్మాయిని అనే విషయాన్ని దాచింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
Bigg Boss OTT Telugu nonstop bindhu madhavi life interesting facts
బిందు మాధవి తెలుగు అమ్మాయి కాదు అంటూ ప్రచారం చేయడం వల్లనే ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ బిందు మాధవికి నిజంగానే తెలుగమ్మాయి అని పరిచయం చేసుకుంటే అన్ని ఆఫర్లు వచ్చేవి కావేమో. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లోకి వచ్చినా ఆఫర్లు రావడం లేదు. దాంతో ఇక్కడ నుండి కోలీవుడ్ కు వెళ్లినా బిందుమాధవి అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చూడ్డానికి పాతికేళ్ల అమ్మాయిలాగా అనిపించే బిందు మాధవి వయస్సు 35 సంవత్సరాలు. ఆమె వెంటపడుతున్న శివకి పాతిక సంవత్సరాలు. అంటే ఆమెకు అతడికి దాదాపుగా పది సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. కానీ అలా అనిపించకుండా బిందు మాధవి చాలా అందంగా కనిపిస్తుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.