Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ముగింపు దశకు వచ్చింది. ఎప్పుడైనా సీజన్ ముగిసే సమయంకు హౌస్ లో కంటెస్టెంట్స్ కేవలం అయిదుగురు మాత్రమే ఉండే వారు. కాని ఈసారి మాత్రం చివరి వారం ముగియబోతున్నా ఇంకా ఏడు మంది ఉన్నారు. ఇంకా రెండు వారాలు కొనసాగించే అవకాశం అస్సలే లేదు. ఒకటి రెండు రోజుల్లో మొత్తం షో కు పేకప్ చెప్పబోతున్నారు. కనుక బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా విభిన్నంగా జరుగబోతుంది అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వర్గాల వారి నుండి సమాచారం అందుతోంది.
మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను ఏకంగా మూడు రోజుల పాటు చిత్రీకరించబోతున్నారట. సాదారణంగా అయితే రెండు రోజులు మాత్రమే చిత్రీకరణ ఉంటుంది. కాని ఈసారి గురు వారం నుండి మొదలుకుని ఒక్కో రోజు ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారు. డాన్స్ కార్యక్రమాలు ఉండటంతో పాటు పాత కంటెస్టెంట్స్ అంతా కూడా స్టేజ్ పై సందడి చేసే ఎపిసోడ్ చివరి రోజు చిత్రీకరిస్తారు. సినిమా ప్రమోషన్స్ తో పాఉట ఇతర ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేను ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది.గురువారం ఎపిసోడ్ లో ఒకరు, శుక్రవారం ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ అవ్వగా చివరి రోజుకు టాప్ 5 మాత్రమే మిగులుతారు.
ఇది చాలా విభిన్నమైన పక్రియగా బిగ్ బాస్ ప్రేక్షకులు మరియు పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ విషయం పై స్పష్టత రాలేదు. గత సీజన్ లో సన్నీ అంటూ అంతా బలంగా నమ్మారు. ఆయన విజేతగా నిలిచాడు. కాని ఈసారి మాత్రం ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో యాంకర్ శివ కాస్త తక్కువ అయినా బిందు మాధవి మరియు అఖిల్ సార్దక్ లు ట్రోఫీ కోసం హోరా హోరీ అన్నట్లుగా ఉన్నారు. టాప్ 3 లో యాంకర్ శివ.. బిందు.. అఖిల్ లు నిలవడం నూరు శాతం పక్కా. ఆర్డర్ ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఆదివారం మద్యాహ్నంకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.