Bigg Boss OTT Telugu nonstop second week elimination
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండవ వారంలో శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది. టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న శ్రీ రాపాక హీరోయిన్ గా రామ్ గోపాల్ వర్మ నగ్నం అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. నటిగా రాంగోపాల్ వర్మ సినిమాలో నటించడం ద్వారా దక్కిన గుర్తింపు తోనే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. కాని అనూహ్యంగా ఆమె రెండు వారాల్లోనే బయటకు వచేసింది.శ్రీ రాపాక వ్యవహారం మరీ నెగిటివ్గా ఏమీ లేదు.
కొన్నిసార్లు అగ్రెసివ్ అయినా కూడా ఆమెకు జనాల నుండి మద్దతు అయితే ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ అభిమానులు కూడా పట్టించుకో లేదు. ఆమె ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారం మిత్రశర్మ ఎలిమినేట్ అవుతుంది అని ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మిత్ర శర్మ ఏ టాస్క్ ల్లో కూడా పాల్గొనడం గానీ.. ఇతర సభ్యులతో మాట్లాడడం కానీ చేయలేదు.అసలు ఆమె హౌస్ లో ఉందా లేదా అని అనిపిస్తుంది కనుక జనాలు ఆమెకు ఓట్లు వేయకపోవచ్చు అంటూ అంతా భావించారు. కానీ శ్రీ ని ఎలిమినేట్ చేయడం చర్చనీయాంశం గా మారింది.
Bigg Boss OTT Telugu nonstop second week elimination
మిత్ర శర్మ ఎలిమినేట్ అవుతుందని భావించిన వారికి అనూహ్యంగా శ్రీ ఎలిమినేట్ అవ్వడం కాస్త షాకింగ్ గానే ఉంది. దీంతో మరో సారి బిగ్బాస్ వారు ఓటింగ్ నిర్వహించినా చివరకు తాము అనుకున్న వారిని.. షో కి అవసరం లేదు అనుకున్న వారిని మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా లో ఖచ్చితంగా మిత్ర శర్మ కంటే రాపాక కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. మిత్ర శర్మ షో లో ఉండడం వల్ల గ్లామర్ డోసు ఉంటుందని నిర్వాహకులు భావించారేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
This website uses cookies.