Home » Entertainment » Bigg Boss Ott Telugu Sarayu Comments On Akhil Ashu Reddy Relationship
Entertainment

Bigg Boss OTT Telugu : అఖిల్‌ అషూ రెడ్డి రిలేష‌న్‌పై స‌ర‌యు సంచ‌ల‌న కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: March 29, 2022, 3:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ షోలో ఎలాంటి ఘోరాతి ఘోరాలు జ‌రుగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటూ ర‌చ్చ చేస్తున్నారు. 17మందితో మొద‌లైన ఈ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు ఎలిమినేట్ అయ్యారు. చివ‌రిగా స‌ర‌యు ఎలిమినేట్ కాగా, దీనిపై ఊహించ‌ని విధంగా ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. స‌ర‌యు కూడా త‌న ఎలిమినేష‌న్ ఫేక్ అని అంటుంది. స‌ర‌యు బ‌య‌ట‌కు వ‌చ్చాక యాంక‌ర్ ర‌వి ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా, ఆమె చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. బిగ్‌బాస్ షో అంటేనే పెద్ద గబ్బు షో అని ఇందులో లవ్ ట్రాక్‌లు పెట్టి.. ప్రతి సీజన్‌కి ఒకటి రెండు జంటల్ని బకరాలను చేస్తుంటారని చెప్పుకొచ్చింది.

Advertisement

ఈ ఓటీటీ సీజన్‌లో కూడా లవ్ ట్రాక్‌‌లు మొదలయ్యాయని చెప్పింది. బోల్డ్ బ్యూటీ అషురెడ్డి అఖిల్‌కి అంటిపెట్టుకునే కనిపిస్తుందని, అఖిల్‌ని హౌస్‌లో ఎవరైనా చిన్న మాట అన్నా అషూ రెడ్డి ఎగిరిపడుతుందని, అసలు ఆమె బిగ్‌బాస్ గేమ్ ఆడటానికి వచ్చిందో లేక అఖిల్ కోసం వచ్చిందో తెలియదు కానీ.. అఖిల్ కోసమే అషు అన్నట్టుగా వరస్ట్ గేమ్ ఆడుతోందని సరయు కామెంట్స్ చేసింది. అఖిల్ గ్రూప్ ఎవరితోనూ కలవరు.. మనల్ని వెళ్లి ఆ గ్రూప్‌లో కలవనియ్యరు. నేను అఖిల్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తే..

Bigg Boss OTT Telugu Sarayu comments on Akhil Ashu Reddy relationship

Advertisement

Bigg Boss OTT Telugu : స‌ర‌యు బాధ‌ని వెళ్ల‌గ‌క్కిందా..!

పక్కనున్న వాళ్లు.. ఏ..ఏ.. అని చిల్లరగా చేస్తారు.ఈ చిల్లర వేషాలు వేయడంతో అషురెడ్డి ఫస్ట్ ఉంటుంది. ఆమె ఆటతీరే అంత. అజయ్, అషు, స్రవంతి వీళ్లు ముగ్గురూ వాళ్ల గేమ్ వాళ్లు ఆడటం లేదు.. అఖిల్ కోసమే ఆడతారు. అఖిల్‌ని గెలిపించడం కోసమే ఆడుతున్నారు అంటూ ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది స‌ర‌యు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం వారియర్స్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఛాలెంజర్స్ నుంచి శ్రీరాపాక, మూడో వారం వారియర్స్ నుంచి ఆర్జే చైతూ, నిన్న సరయు ఎలిమినేట్‌ అయ్యారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి