
Bigg Boss Priyanka Singh Marries soon
Bigg Boss Priyanka : బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో ఆరో సీజన్ కూడా జరుపుకోనుంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే ట్రాన్స్ జెండర్ గా సీజన్ 5లో అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ కూడా అందరికి బాగా దగ్గరైంది. మానస్‌తో ప్రేమ వ్యవహారం నడిపి హైలైట్ అయింది. సీజన్ త్రీ లో పాల్గొన్న మరో ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి లా ప్రవర్తిస్తుందేమో అని అనుకున్నారు. కాని చాలా కూల్‌గా, ఒబీడియెంట్‌గా ఉంటూ అందరి మన్ననలు పొందింది ప్రియాంక. ఆ తర్వాత ప్రియాంక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మరింత దగ్గరయింది.
అందులో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటో పరుచుకుని ప్రియాంక తాజాగా తన హల్దీ ఫొటోస్ పంచుకొని అందరికీ షాక్ ఇచ్చింది.ఇందులో ప్రియాంక పెళ్లి కూతురిలా ముస్తాబై కనిపిస్తుంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటూ అందుకేనా ఈ హల్దీ ఫొటోస్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఫొటో షూట్ ఫోటోసా, లేక నిజంగానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందా అనే దానిపై క్లారిటీ లేదు గాని ప్రస్తుతం పిక్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. జబర్దస్త్’ షో లో లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి తేజ..
Bigg Boss Priyanka Singh Marries soon
ఇప్పుడు ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తుంది. చిన్నతనం నుంచి తండ్రి వ్యతిరేకించడం.. కష్టపడి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఎంటర్ అవడం, లింగ మార్పిడి సర్జరీ, అనారోగ్య సమస్యలు, మెగా బ్రదర్ నాగబాబు సాయం చెయ్యడం.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడం.. ఇలా సాయి తేజ, ప్రియాంక సింగ్ వరకు మారడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలున్నాయి.. హర్మోన్ల కారణంగా సాయి తేజ శరీరంలో మార్పులు చోటు చేసుకోవడంతో తల్లి సపోర్ట్‌గా ఉన్నప్పటికీ తండ్రి మాత్రం వ్యతిరేకించారు. ‘బిగ్ బాస్ 5’ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికైనా నన్ను మీ బిడ్డగా యాక్సెప్ట్ చెయ్యండి డాడీ అంటూ ప్రియాంక సింగ్ కంటతడి పెడుతూ తన తండ్రికి విజ్ఞప్తి చెయ్యడం చూసి అంతా ఎమోషనల్ అయ్యారు.
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
This website uses cookies.