Home » Entertainment » Bigg Boss Season 5 Latest Promo Released
Entertainment

Bigg boss season 5 : బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వదిలిన స్టార్ మా..నాగార్జున తప్ప ఇది మరెవరూ చేయలేరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 14, 2021, 8:13 pm
Advertisement

Bigg boss season 5 : దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో కి సంబంధించిన సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా బృందం విడుదల చేసింది. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఈ ప్రోమోలో సరికొత్తగా అదరగొట్టాడు. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో నవరసాల మోతాదు కాస్త ఎక్కువగానే ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ బిగ్ రియాలిటీ షోకి అసాధారణమైన పాపులారిటీ ఉంది.

Advertisement

bigg-boss-season 5-latest promo released

బిగ్ బాస్ ప్రారంభం అయితే జనాలు సినిమాలు సీరియల్స్ కూడా పట్టించుకోకుండా టీవీలకి అతుక్కుపోతారు. తెలుగులో మొదటి సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని, సీజన్ 3 నుంచి నాగార్జున కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సారి నాగార్జున షో నుంచి తప్పుకొని రానా వచ్చి హోస్ట్ గా వ్యవహరించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోతో అందరికీ ఉన్న అనుమానాలన్ని మబ్బుల్లా విడిపోయాయి.

Advertisement

Bigg boss season 5: తాజా ప్రోమో ప్రసారమవుతూ ట్రెండ్ అవుతూ షో మీద విపరీతమైన ఆక్తిని పెంచేస్తుంది.

ఇక తాజా ప్రోమో ప్రసారమవుతూ ట్రెండ్ అవుతూ షో మీద విపరీతమైన ఆక్తిని పెంచేస్తుంది. కాగా త్వరలో దీనికి సంబంధించిన టెలికాస్ట్ డేట్ వెల్లడించనున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రోమో ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనుకున్న స్టార్ మా బృందం ఒకరోజు ముందుగానే వదిలి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి