Home » Entertainment » Bigg Boss Shiva Jyothi Romantic Reel With Husband
Entertainment

Bigg Boss Shiva Jyothi : రెచ్చిపోయిన బిగ్ బాస్ శివజ్యోతి.. ముద్దులతో కెమెరాముందే జోడి హల్చల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 30, 2022, 4:20 pm
Advertisement

Bigg Boss Shiva Jyothi : సావిత్రి, సావిత్రక్క.. అంటూ తెలంగాణ యాసలో వార్తలు చెప్పి ఫేమస్ అయింది. ఆమె అసలు పేరు ఎవ్వరికీ తెలియదు. సావిత్రి అనేది ఆమె పేరులా మారిపోయింది. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాకే ఆమె అసలు పేరు బయటకు వచ్చింది. శివ జ్యోతి అనేది తన పేరు అని.. సావిత్రి అనేది తన స్క్రీన్ పేరు అని చెప్పింది. ఇకపై తనను అందరూ శివజ్యోతిగానే గుర్తించాలనే ధ్యేయంతోనే బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినట్టు చెప్పుకొచ్చింది. అనుకున్నట్టుగానే శివజ్యోతి, జ్యోతక్కగా ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ షో తరువాత ఆమె పూర్తిగా మారిపోయింది.

Advertisement

సెలెబ్రిటీలతో సావాసాలు, టీవీల్లో కనిపించడం, స్టార్‌గా హోదా రావడంతో ఆమె కట్టూబొట్టూలో ఎంతో మార్పు వచ్చింది. జీవన శైలి మారింది. ఇళ్లు, కారు, స్టేటస్ అన్నీ వచ్చాయి. దీంతో ఆమె వస్త్రాధారణలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు చీరకట్టుతో కనిపించే శివజ్యోతి ఇప్పుడు పొట్టి బట్టలు, మోడ్రన్ దుస్తుల్లో మెరుస్తుంది. చివరకు తన భర్త గంగూలిని కూడా మార్చేసింది. స్క్రీన్ మీదకు తీసుకొచ్చి నానా రచ్చ చేసింది. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఇప్పుడు దూసుకుపోతోన్నారు. యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాం, జోష్ యాప్ ఇలా అన్నింట్లోనూ దూసుకుపోతోన్నారు. మొత్తానికి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌‌లో ఈ భార్యాభర్తలిద్దరూ దుమ్ములేపుతున్నారు.

Bigg Boss Shiva Jyothi Romantic Reel WIth Husband

Advertisement

అయితే ఒక్కోసారి శివజ్యోతి డ్రెస్సింగ్ మీద నానా రకాల ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఆ మధ్య మోకాళ్లు కనిపించేలా దుస్తులు వేసుకోవడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె ప్రెగ్నెన్సీ మీద కూడా నానా రకాల రూమర్లు వచ్చేశాయి. దానిపై ఆమె ఖండన కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈ జోడి అలా హాయిగా విహరిస్తోన్నట్టుంది. జోష్ యాప్ ప్రమోషన్స్‌లో భాగంగా రొమాన్స్ చేశారు. ఒకరి మీద మరొకరు ముద్దుల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో మీద నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు కూడా మారిపోయారా? ఇలా తయారయ్యారేంటి? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి