Home » Entertainment » Bigg Boss Siri Hanmanth And Shrihan Buys New Car
Entertainment

Bigg Boss Siri : కొత్త కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ సిరి.. శ్రీహాన్ కామెంట్స్ వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 11, 2022 12:42 pm
Advertisement

Bigg Boss Siri : బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. సిరి బిగ్ బాస్ ఇంట్లో వేసుకున్న పొట్టి బట్టలు, చేసిన ఎక్స్‌పోజింగ్, కురిపించిన ముద్దుల వర్షం ఎంతగా కాంట్రవర్సీకి దారి తీశాయో అందరికీ తెలిసిందే. సిరి చేసిన రొమాన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ భయపడిపోయి ఉంటారు. ప్రతీ ఎపిసోడ్‌లో హగ్గులు, ముద్దులు కామన్. సిరి షన్ను ముద్దుల వ్యవహారంతో బయట వివాదానికి దారి తీసింది. ఆ విషయం లోపల ఉన్న ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. చివరకు తన కన్న తల్లి చెప్పినా కూడా వినలేదు. హగ్గులు, ముద్దులు తనకు నచ్చలేదని చెప్పినా, బయట జరుగుతున్న దానిపై హింట్ ఇచ్చినా కూడా సిరి షన్నులు మారలేదు.

Advertisement

మరీ ముఖ్యంగా సిరి అయితే షన్నుని లవ్ చేస్తున్నట్టుగా ప్రవర్తించింది. షన్ను లేకపోతే బతకలేను అన్నట్టుగా మారిపోయింది. తాను చేస్తోంది తప్పు అని తనకు తెలుసు అంటూనే చేసుకుంటూ పోయింది. సిరి వింత ప్రవర్తన, షన్ను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందరినీ గందరగోళానికి గురి చేశాయి. ఫ్రెండ్స్ అంటారు.. కానీ ఫ్రెండ్స్‌లా ప్రవర్తించనేలేదు. అలా మొత్తానికి సిరి షన్నులు చేసిన దానికి బాగానే మూల్యం చెల్లించుకున్నారు. షన్నుకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. సిరి శ్రీహాన్‌లు కూడా విడిపోయారని టాక్ వచ్చింది. కానీ చివరకు మళ్లీ కలిశారు.

Bigg Boss Siri Hanmanth And Shrihan Buys New Car

Advertisement

ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ పోస్ట్ వేశారు. బిగ్ బాస్ సిరి కొత్త కారును కొనేసింది. ఈ మేరకు ఆమె పోస్ట్ వేసింది. ఆమె వెంట శ్రీహాన్ కూడా ఉన్నాడు. మొత్తానికి ఈ కొత్త కారు కొనడంపై శ్రీహాన్ కౌంటర్లు వేశాడు. ముందు డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్లు వేశాడు. మొత్తానికి సిరి, శ్రీహాన్‌లు జంటగా ఇలా కారు కొనేశారు. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో శ్రీహాన్ రాబోతోన్నాడంటూ టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి శ్రీహాన్ వస్తే మాత్రం ఆట అదిరిపోతుంది. స్టేజ్ మీదున్న ఐదు నిమిషాల్లోనే శ్రీహాన్ అందరి హృదయాలను దోచేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి