Bigg Boss Siri : సిరి హన్మంత్, శ్రీహాన్ జోడికి ముందు నుంచి మంచి ఫాలోయింగే ఉంది. అయితే బిగ్ బాస్ షో తరువాత అది మరింత ఎక్కువైంది. బిగ్ బాస్ కంటే ముందు సిరికే ఎక్కువ క్రేజ్ ఉండేది. బిగ్ బాస్ సీజన్‌లో సిరి ఎంతో ప్రయాణం చేసింది. కానీ ఆమెకు మాత్రం పూర్తి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ శ్రీహాన్ మాత్రం ఒకే ఒక్క రోజు బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించాడు. అతని మాటతీరు, ప్రవర్తన, మెచ్యూరిటీకి అందరూ ఫిదా అయ్యారు. అలా సిరి కంటే ఎక్కువగా శ్రీహాన్‌కే క్రేజ్ వచ్చింది. ఇప్పుడు శ్రీహాన్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా శ్రీహాన్ బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
దాదాపు అది ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఆరో సీజన్లో శ్రీహాన్ ఉంటాడని అందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే అంతకు ముందు ఇలా అందరూ ఒకే చోట వచ్చారు. స్టార్ మా సీరియల్ జోడి, బిగ్ బాస్ జోడిలను తీసుకొచ్చి ఈవెంట్లు చేస్తున్నారు. మొగుడ్స్ పెళ్లామ్స్ అనే ఈవెంట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌లో సీరియల్ తారలతో పాటుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా రచ్చే చేశారు. జానకి కలగనలేదు, గుప్పెడంత మనసు, గోరింటాకు టీం బాగానే రొమాన్స్ చేసింది. మరీ ముఖ్యంగా గుప్పెడంత మనసు వసు, రిషి ఇద్దరూ కూడా మగధీర స్టైల్లో పర్ఫామెన్స్ చేశారు.
జానకి కలగనలేదు టీం అయితే అమర్ దీప్, ప్రియాంక జైన్‌లు స్టేజ్ మీద రొమాన్స్ చేశాడు. ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు. అలా మొత్తానికి అన్ని జోడీలు బాగానే రచ్చ చేశాయి.మరీ ముఖ్యంగా అయితే సిరి, శ్రీహాన్ అయితే ఫుల్ కిక్కు అంటూ దుమ్ములేపేశారు. మొదటిసారిగా ఇలా బుల్లతెరపై డ్యాన్స్ వేశారు. సిరి శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఎన్నో వెబ్ సిరీస్‌లో నటించారు. కానీ ఇలా బుల్లితెరపై మాత్రం ఓ మాస్ పర్ఫామెన్స్ చేయడం ఇదే మొదటి సారి. మధ్యలో ఈ జోడి విడిపోయిందనే రూమర్లు బలంగా వినిపించాయి. కానీ మొత్తానికి ఈ జోడి ఒక్కటిగానే ఉంది. ఇలా కలిసి స్టెప్పులు వేస్తోంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.